ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఢిల్లీకి కెప్టెన్ ఫిక్స్.. రిషబ్ స్థానంలో అతడికే పట్టం!

ABN, First Publish Date - 2023-03-16T20:24:34+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఢిల్లీ జట్టును నడిపించేదెవరన్న విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఢిల్లీ జట్టును నడిపించేదెవరన్న విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) జట్టుకు సారథ్యం వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గతేడాది డిసెంబరు చివర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని వార్నర్‌తో భర్తీ చేయాలని హెడ్ కోచ్ రికీ పాంటింగ్, జట్టు మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పంత్ ఐపీఎల్ మొత్తానికి దూరం కావడంతో జట్టు పగ్గాలు ఎవరి చేతికి అందించాలన్న దానిపై జట్టు మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడింది. ఈ క్రమంలో వార్నర్‌తోపాటు గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ (Axar Patel) పేర్లను పరిగణనలోకి తీసుకుంది. చివరికి వార్నర్‌ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

వార్నర్ కనుక పగ్గాలు చేపడితే అది రెండోసారి అవుతుంది. గతంలో 2009లో రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు 2014లో వార్నర్‌ను కొనుగోలు చేసింది. 2016లో ఆ జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. మ్యాచ్‌ల పరంగా చూస్తే వార్నర్ ఐదో విజయవంతమైన కెప్టెన్‌. 69 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే 35 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 32 మ్యాచుల్లో ఓటమి పాలు కాగా, రెండింటిలో ఫలితం తేలలేదు.

వార్నర్ 47.33 సగటు, 142.28 స్ట్రైక్‌రేట్‌తో 2,840 పరుగులు చేశాడు. వీటిలో కెప్టెన్‌గా ఒక సెంచరీ, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, 2021లో ఫామ్ కోల్పోయి తంటాలు పడడంతో వార్నర్‌ను బెంచ్‌కు పరిమితం చేసి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించారు. దీంతో 2022 మెగా వేలానికి ముందు వార్నర్‌ను హైదరాబాద్ వదిలించుకుంది. ఆ తర్వాత అతడిని ఢిల్లీ కేపిటల్స్ రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. ఆ సీజన్‌లో వార్నర్ దుమ్మురేపాడు. 48 సగటు, 150.52 స్ట్రైక్ రేట్‌తో 432 పరుగులు చేశాడు. అందులో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది.

ఇవి కూడా చదవండి

**************************

* RCB: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్!

* Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

* WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

Updated Date - 2023-03-16T20:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising