IND vs AUS T20 Series: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకి కెప్టెన్సీ బాధ్యతలు
ABN, First Publish Date - 2023-11-20T23:21:56+05:30
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ముగిసింది. టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో మరో పోరుకి సిద్ధమవుతోంది. నవంబర్ 23వ తేదీ నుంచి ఆ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే..
వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ముగిసింది. టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో మరో పోరుకి సిద్ధమవుతోంది. నవంబర్ 23వ తేదీ నుంచి ఆ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. బీసీసీఐ ఈ సిరీస్‌కి భారత జట్టుని ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఈసారి కెప్టెన్ పగ్గాలు సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. నిజానికి.. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించాల్సింది కానీ, అతడు గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. అందుకే, అతని స్థానంలో సూర్యని కెప్టెన్‌గా నియమించింది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఇక అప్పటి నుంచి రెండు రోజుల గ్యాప్ చొప్పున.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు తిరువనంతపురం, గౌహాతీ, రాయ్‌పూర్, బెంగళూరు వేదిక కాబోతున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియా.. ఈ టీ20 సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరి, ఈ సిరీస్‌లో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి. అయితే.. సంజూ శంసన్‌కి అవకాశం దక్కకపోవడంపై, అతని అభిమానులు మండిపడుతున్నారు. ఇతరులకు బోలెడన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు.. సంజూకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
Updated Date - 2023-11-20T23:21:57+05:30 IST