ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bazball Cricket: టెస్టుల్లో ఇంగ్లండ్ దృక్ప‌థం ఇంతేనా? మోర్గాన్ ఏమంటున్నాడు?

ABN, First Publish Date - 2023-07-01T15:16:12+05:30

ప్ర‌స్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు బ‌జ్ బాల్ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది.అయితే ఇదే వ్యూహంతో ప్ర‌స్తుత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బొక్క‌బోర్లా ప‌డింద‌నే చెప్పాలి. కానీ ఆస్ట్రేలియాపై గెల‌వాలంటే ఇంగ్లండ్ బ‌జ్ బాల్ త‌ర‌హాలోనే ఆడాల‌ని మాజీ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్ హిత‌వు ప‌లికాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌స్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్(England) క్రికెట్ జ‌ట్టు బ‌జ్ బాల్ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. బ‌జ్ బాల్ అంటే దూకుడుగా ఆడి ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించ‌డం. అయితే ఇదే వ్యూహంతో ప్ర‌స్తుత యాషెస్ సిరీస్ (Ashes Series)లో ఇంగ్లండ్ బొక్క‌బోర్లా ప‌డింద‌నే చెప్పాలి. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల వ‌ద్ద స్కోరు డిక్లేర్ చేసి ఇంగ్లండ్ దెబ్బ‌తింది. దీంతో ఆ జ‌ట్టుకు చివ‌ర‌కు చేదు ఫ‌లిత‌మే మిగిలింది. ఇక రెండో టెస్టు విష‌యంలోనూ ఇంగ్లండ్ బ‌జ్ బాల్ వ్యూహాన్నే న‌మ్ముకుని మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ మంచి స్థితిలో ఉన్నా మూడో రోజు ఉద‌యం ఆట‌లో దూకుడుగా ఆడి వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా(Australia)కు భారీ ఆధిక్యాన్ని స‌మ‌ర్పించుకుంది.

ప్ర‌స్తుతం రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే స‌రికి ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. దీంతో క్రికెట్ మాజీలంద‌రూ ఇంగ్లండ్ ప్ర‌ద‌ర్శ‌న‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ఇంగ్లండ్ త‌గ్గేదేలే అంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eion Morgan) కూడా త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను స‌మ‌ర్ధించుకున్నాడు. ఆస్ట్రేలియాపై గెల‌వాలంటే ఇంగ్లండ్ బ‌జ్ బాల్ త‌ర‌హాలోనే ఆడాల‌ని హిత‌వు ప‌లికాడు. ఒక‌వేళ రెండో టెస్టులో ప్ర‌తికూల ఫ‌లితం వ‌స్తే ఇంగ్లండ్ త‌మ దృక్ప‌థం మార్చుకుంటుందేమోన‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Updated Date - 2023-07-01T15:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising