ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ICC Womens T20 World Cup 2023: దక్షిణాఫ్రికా ముందు ఊరించే లక్ష్యం.. ప్రపంచకప్ సొంతమయ్యేనా?

ABN, First Publish Date - 2023-02-26T20:18:55+05:30

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రపంచకప్‌పై ఆరోసారి కన్నేసిన ఆసీస్‌ భారీ స్కోరు చేయకుండా నిలువరించడంలో సఫారీ బౌలర్లు విజయం సాధించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 36 పరుగుల వద్ద ఓపెనర్ అలిస్సా హీలీ (18)ను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గార్డ్‌నర్‌తో కలిసి బెత్ మూనీ సూపర్ కుదురుగా ఆడింది. స్కోరుబోర్డుపై ఓ వైపు పరుగులు పెంచుతూనే మరోవైపు వికెట్లు కాపాడుకుంటూ ఇద్దరూ సంయమనంతో ఆడారు. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో జోరుమీదున్నట్టు కనిపించిన గార్డనర్ (29) 82 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు ఒత్తిడి పెంచారు. దీంతో చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ పరుగులు రాబట్టేందుకు ఆసీస్ బ్యాటర్లు చెమటోడ్చారు.

గ్రేస్ హారిస్ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (10), ఎల్లిస్ పెర్రీ (7) తీవ్రంగా నిరాశ పరిచారు. మూనీ క్రీజులో పాతుకుపోయినప్పటికీ మరోవైపు నుంచి మద్దతు లేకపోవడంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆసీస్ 156 పరుగులకే పరిమితమైంది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఊరిస్తున్న లక్ష్యాన్ని సఫారీలు ఛేదించి సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటారో? లేదో? చూడాల్సిందే.

Updated Date - 2023-02-26T20:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising