ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

ABN, First Publish Date - 2023-11-05T18:18:16+05:30

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో..

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్) శతక్కొట్టడం.. శ్రేయస్ అయ్యర్ అర్థశతకంతో రాణించడంతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.


తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ టీమిండియాకు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా.. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఎడాపెడా షాట్లతో రెచ్చిపోయి ఆడాడు. దీంతో.. 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహకారంతో 40 పరుగులు చేశాడు. రోహిత్ దూకుడు చూసి.. అతడు 200 పరుగులు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే రోహిత్ ఔట్ అవ్వడంతో మైదానం మొత్తం కాసేపు మూగబోయింది. ఆ కాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా ఔట్ అవ్వడంతో.. భారత జట్టు ఒత్తిడిలో పడినట్టయ్యింది. అప్పుడు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్.. ఆచితూచి ఆడారు. సౌతాఫ్రికాకు మరో వికెట్ ఇవ్వకుండా.. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యం జోడించారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. మెరుగైన ఇన్నింగ్స్‌తో జట్టుని కాపాడారు.

ఈసారి శ్రేయస్ బాగా ఆడుతుండటం చూసి.. అతడు సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. 77 వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కి చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే.. చివర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (22), జడేజా (29 నాటౌట్) బాగానే రప్ఫాడించారు. కోహ్లీ చివరివరకూ క్రీజులో నిల్చొని సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ.. అతని నుంచి ఆశించిన భారీ షాట్లైతే పడలేదు. 121 బంతుల్లో 10 ఫోర్ల సహకారంతో అతను 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. సౌతాఫ్రికా 327 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి లక్ష్యమే అయినా.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా విజృంభిస్తోంది. కాబట్టి.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ఆ జట్టుని కట్టడి చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-11-05T18:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising