India vs Australia: జడేజా దెబ్బకు ఆసీస్ విలవిల.. ఎంత స్కోర్‌కు ఆలౌట్ అయ్యారంటే..

ABN, First Publish Date - 2023-02-09T15:35:54+05:30

టీమిండియా, ఆస్ట్రేలియా (India vs Australia) తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ జట్టు 177 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా (Jadeja) దెబ్బకు..

India vs Australia: జడేజా దెబ్బకు ఆసీస్ విలవిల.. ఎంత స్కోర్‌కు ఆలౌట్ అయ్యారంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా, ఆస్ట్రేలియా (India vs Australia) తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ జట్టు 177 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా (Jadeja) దెబ్బకు ఆస్ట్రేలియా జట్టు (Australia Cricket Team) కుప్పకూలింది. లబుషేన్‌ (49), స్మిత్ (37), రెన్‌షా(0), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌(31), టాడ్ ముర్ఫీ (0) వికెట్లను పడగొట్టి జడేజా ఆసీస్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. కమ్ బ్యాక్ మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ అదరగొట్టాడు. 5 వికెట్లతో రాణించి సత్తా చాటాడు.

22 ఓవర్లు బౌలింగ్ చేసి 8 ఓవర్లు మేడిన్ చేసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్ల తీయడంతో జడేజా పేరు మోత మోగుతోంది. ఆసీస్‌ జట్టు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. ఇక.. టీమిండియా ఓవరాల్ బౌలింగ్ విషయానికొస్తే.. జడేజాతో పాటు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ కూడా రాణించాడు. 3 వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో కూడా మరో అరుదైన రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 450 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. ఇక పేసర్లు షమీ, సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌ ఫ్రెండ్లీ వికెట్‌ కావడంతో.. బంతి అనూహ్యంగా టర్న్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ స్పిన్నర్లకు తుది జట్టులో పెద్దపీట వేశాయి. ఆతిథ్య జట్టును స్పిన్‌తో దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఏకంగా నలుగురు స్పిన్నర్లను టూర్‌కు ఎంపిక చేసింది. అంతేకాకుండా అశ్విన్‌ తరహా బౌలింగ్‌ శైలి కలిగిన మహీష్‌ పిథియాతో నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేసింది. స్పిన్‌ విభాగానికి అగర్‌, లియాన్‌ నేతృత్వం వహించనున్నారు.

Updated Date - 2023-02-09T15:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising