ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia 1st Test: లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..

ABN, First Publish Date - 2023-02-09T12:51:30+05:30

నాగ్‌పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో (India vs Australia 1st Test) లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 32 ఓవర్లలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో (India vs Australia 1st Test) లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 32 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. షమీ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner) ఒక్క పరుగు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఖవాజా (Usman Khawaja) (1) కూడా సిరాజ్ (Siraj) బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ‌గా పెవిలియన్ చేరాడు. దీంతో.. రెండు పరుగులకే ఆస్ట్రేలియా జట్టు రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

స్టీవెన్ స్మిత్ (Steven Smith) 74 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయగా, 110 బంతుల్లో 8 ఫోర్లు కొట్టిన లబుషేన్‌ (Marnus Labuschagne) 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్, లబుషేన్ క్రీజులో ఉన్నారు. రోహిత్‌ సేనకు స్వదేశంలో ఈ టెస్ట్ సిరీస్ అగ్ని పరీక్ష అని చెప్పక తప్పదు. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్త్‌ ఆశలు ఊరిస్తున్న నేపథ్యంలో టాప్‌ టీమ్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ నేటినుంచి తలపడే బోర్డర్‌-గవాస్కర్‌ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఎంతో కీలకం. ప్రతీ మ్యాచ్‌ తుది పోరు లాంటిదని భావిస్తున్న నేపథ్యంలో టీమిండియాపై అధిక ఒత్తిడి నెలకొంది.

ఈ సిరీస్‌లో భారత్‌ కనీసం మూడు టెస్ట్‌లు నెగ్గితే.. సమీకరణలు అవసరం లేకుండా దర్జాగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ పట్టేసే చాన్సుంది. మరోవైపు వరుసగా రెండుసార్లు తమ సొంతగడ్డపై టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి అదే రేంజ్‌లో బదులు తీర్చుకోవాలని కంగారూ జట్టు పట్టుదలగా ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందే టెస్ట్‌ ఫార్మాట్‌లో రెండు అగ్రశ్రేణి జట్లు తలపడడం ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచనుంది. యాషెస్‌ను మించిన ప్రాధాన్యత సంతరించుకోవడంతో.. ఈ సిరీస్‌ ఆటగాళ్ల తలరాతలను మార్చే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా.

Updated Date - 2023-02-09T12:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising