IND vs NZ: సెంచరీతో టీమిండియాకు షాక్ ఇచ్చిన కివీస్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్
ABN, First Publish Date - 2023-01-18T21:41:29+05:30
ఆ కివీస్ ఆల్‌రౌండర్‌పై ఏమాత్రం అంచనాలు లేవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా అతనిని సొంతం చేసుకునేందుకు ఏ ఐపీఎల్ జట్టు ఆసక్తి చూపలేదు. కానీ.. ఆ ఆల్‌రౌండర్ సత్తా ఏంటో..
ఆ కివీస్ ఆల్‌రౌండర్‌పై ఏమాత్రం అంచనాలు లేవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా అతనిని సొంతం చేసుకునేందుకు ఏ ఐపీఎల్ జట్టు ఆసక్తి చూపలేదు. కానీ.. ఆ ఆల్‌రౌండర్ సత్తా ఏంటో హైదరాబాద్ వేదికగా అందరికీ తెలిసొచ్చింది. 57 బంతుల్లో బ్రేస్‌వెల్ సెంచరీతో తనేంటో నిరూపించాడు. వన్డే ఫార్మాట్‌లో రెండో సెంచరీతో రాణించాడు. శాంటర్న్, బ్రేస్‌వెల్ కలిసి 44 ఓవర్లు ముగిసే సమయానికి 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. 44 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.
131 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన కివీస్ పరిస్థితిని చూసి ఇక టీమిండియా గెలుపు ఖాయమని అభిమానులు భావించారు. కానీ.. బ్రేస్‌వెల్ సెంచరీతో చెలరేగి ఆడి టీమిండియా అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిలకడ లేక ఇబ్బందిపడుతున్న న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్‌కు ఊపిరిపోశాడు. బ్రేస్‌వెల్‌కు తోడు శాంట్నర్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. బ్రేస్‌వెల్ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
Updated Date - 2023-01-18T21:42:34+05:30 IST