ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: సన్ రైజర్స్‌పై టాస్ గెలిచిన చెన్నై

ABN, First Publish Date - 2023-04-21T19:20:30+05:30

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) టాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌పై తేమ ఉండడంతో చేజింగే కరెక్ట్ అని భావించినట్టు టాస్ అనంతరం ధోనీ(Dhoni) చెప్పుకొచ్చాడు. టేబుల్ ప్రకారం కాకుండా కాంబినేషన్ పరంగా చూసుకుని జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుతానికైతే జట్టుకు అందరూ అందుబాటులో లేకపోవడంతో ఎంపిక సులభంగా ఉందని, కానీ మున్ముందు ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటే అప్పుడు తలనొప్పులు తప్పవని నవ్వుతూ చెప్పాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బాగా ఆడామని, ఈ మ్యాచ్‌లోనూ అది కొనసాగిస్తామని హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్కరమ్ చెప్పాడు.

చెన్నై జట్టు బ్యాటింగులో బాగానే రాణిస్తున్నప్పటికీ బౌలింగులో తడబడుతోంది. ఫీల్డింగ్ కూడా సోసోగా ఉంది. ఇక, హైదరాబాద్ కెప్టెన్ మార్కరమ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంది. చేపాక్‌‌లో చెన్నైని మట్టికరిపించాలంటే హైదరాబాద్ మరింత బాగా ఆడాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ 5 మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించి కింది నుంచి రెండోస్థానంలో ఉంది.

Updated Date - 2023-04-21T19:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising