ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఆకాశమే హద్దుగా చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. బెంగళూరు ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2023-04-17T21:34:57+05:30

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) బ్యాటర్లు చెలరేగారు. ఒకరికి మించి ఒకరు బ్యాట్లతో విరుచుకుపడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) బ్యాటర్లు చెలరేగారు. ఒకరికి మించి ఒకరు బ్యాట్లతో విరుచుకుపడ్డారు. చివర్లో వరుసపెట్టి వికెట్లు కోల్పోబట్టి కానీ లేదంటే స్కోరు ఏ 250 పరుగులకో చేరేది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన చెన్నై 226 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి బెంగళూరు ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్యాట్‌తో బెంగళూరును భయపెట్టిన చెన్నై.. బంతితోనూ వణికిస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.

టాస్ గెలిచి చెన్నైకి బ్యాటింగ్ అప్పగించిన బెంగళూరు 16 పరుగుల వద్దే రుతురాజ్ గైక్వాడ్‌ (3)ను అవుట్ చేసి సంబరాలు చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కాన్వే, రహానే కలిసి పోటాపోటీగా ఆడారు. ఇద్దరూ కలిసి బెంగళూరు బౌలర్లను చితక్కొట్టారు. ఈ క్రమంలో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రహానే 90 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

రహానేను అవుట్ చేసిన ఆనందం కూడా బెంగళూరుకు ఎంతోసేపు మిగల్లేదు. క్రీజులోకి వచ్చిన శివం దూబే, కాన్వే కలిసి బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరూ కలిసి బాదుతుంటే స్కోరు 250 పరుగులు దాటడం ఖాయమనిపించింది. ప్రమాదకరంగా మారి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కాన్వేను హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు. 45 బంతులు ఆడిన కాన్వే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు.

ఆ తర్వాత 8 పరుగులకే దూబే కూడా అవుట్ కావడంతో పరుగుల వేగం మందగించింది. 27 బంతులు ఎదుర్కొన్న దూబే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అంబటి రాయుడు 14, మెయిన్ అలీ 19(నాటౌట్) రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, పార్నెల్, వైశాఖ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2023-04-17T21:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising