ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

David Warner: ఐపీఎల్ కెప్టెన్‌గా వార్నర్ అరుదైన రికార్డు

ABN, First Publish Date - 2023-04-11T21:01:49+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఓ జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఓ జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డు సృష్టించాడు. ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)కు సారథ్యం వహిస్తున్న వార్నర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో పరుగుల వరద పారించిన వార్నర్.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 6వేల పరుగులు సాధించిన రికార్డును ఇటీవల తన పేరున రాసుకున్నాడు.

తాజా ఫీట్‌తో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ సరసన వార్నర్ నిలిచాడు. బెంగళూరుకు కెప్టెన్‌గా కోహ్లీ 4,881 పరుగులు చేయగా, చెన్నై, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ (ఇప్పుడు లేదు) కెప్టెన్‌గా ధోనీ 4,582 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 4 వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరిద్దరే.

అలాగే, టోర్నీ చరిత్రలో మరో ఇద్దరు కెప్టెన్లు 3 వేలకు పైగా పరుగులు సాధించారు. వారిలో ఒకరు రోహిత్ శర్మ కాగా మరొకరు గౌతం గంభీర్. కాగా, నేటి మ్యాచ్‌కు ముందు 3 వేల క్లబ్‌లో చేరేందుకు వార్నర్‌కు రెండు పరుగులే అవసరం కాగా క్రీజులోకి రాగానే ఆ రెండు పరుగులను సాధించాడు.

Updated Date - 2023-04-11T21:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising