IPL 2023: వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే?
ABN, First Publish Date - 2023-04-15T17:23:38+05:30
తొలుత బలంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన రాయల్
బెంగళూరు: తొలుత బలంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ (Virat Kohli) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 34 బంతుల్లోనే ఆరు ఫోర్లు, సిక్సర్లతో 50 పరుగులు చేసిన కోహ్లీ మరో భారీ షాట్‌కు యత్నించి లలిత్ యాదవ్ బౌలింగులో యశ్ ధుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కెప్టెన్ ఫా డుప్లెసిస్ (22), మహిపాల్ లోమ్రోర్ (26), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. షాబాజ్ అహ్మద్ 12 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో క్రమశిక్షణతో బౌలింగ్ వేసిన ఢిల్లీ బౌలర్లు పరుగులు ఇచ్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా 174 పరుగులకే బెంగళూరు పరిమితమైంది. ఢిల్లీ (DC) బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ చెరో రెండో వికెట్లు తీసుకున్నారు.
Updated Date - 2023-04-15T17:23:38+05:30 IST