ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: కేకేఆర్‌పై టాస్ గెలిచిన గుజరాత్.. ప్రతీకారం తీర్చుకునేనా?

ABN, First Publish Date - 2023-04-29T15:24:40+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేడు డబుల్ హెడర్ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేడు డబుల్ హెడర్ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)-గుజరాత్ టైటాన్స్(GT) తలపడనుండగా, సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)-సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడతాయి. కోల్‌కతాపై టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.

గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. చివరి ఓవర్‌లో రింకు సింగ్ ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాకు అద్వితీయమైన విజయాన్ని అందించిపెట్టాడు. గుజరాత్‌కు కాళరాత్రిని మిగిల్చాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తిరిగి టాప్ ప్లేస్‌కు చేరుకోవాలని గుజరాత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక, గత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని 21 పరుగుల తేడాతో ఓడించిన కోల్‌కతా విజయోత్సాహంతో బరిలోకి దిగుతోంది. గుజరాత్ కూడా ముంబై ఇండియన్స్‌ను 55 పరుగుల భారీ తేడాతో ఓడించి ఈ సమరానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు హోరీగా జరిగే అవకాశం ఉంది.

కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జాసన్ రాయ్ స్థానంలో గుర్బాజ్, ఉమేశ్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే తలపడుతోంది.

Updated Date - 2023-04-29T15:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising