ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్.. కోల్‌కతాపై టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ మారాడు!

ABN, First Publish Date - 2023-04-16T15:20:01+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత ముంబై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత ముంబై ఇండియన్స్(MI)-కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య ముంబైలో మ్యాచ్ జరగనుండగా, సాయంత్రం ఏడున్నర గంటలకు గుజరాత్ టైటాన్స్(GT)-రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య మ్యాచ్ జరగనుంది.

మరికాసేపట్లో కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కడుపు నొప్పితో బాధపడుతున్న ముంబై సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టుకు దూరం కావడంతో సూర్యకుమార్(Suryakumar Yadav) స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ కోలుకుంటే కనుక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది.

కోల్‌కతా జట్టు నాలుగు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించింది. హోం గ్రౌండ్ కావడంతో విజయంపై ముంబై ధీమాగా ఉంది. దీనికి తోడు ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించిన విశ్వాసంతో ఉంది. కేకేఆర్ మాత్రం హైదరాబాద్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిన పరాభవ భారంతో ఈ మ్యాచ్ ఆడుతోంది. కాబట్టి ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో హోరీహోరీగా తలపడే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-16T15:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising