ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Tewatia: ఫినిషింగ్ సీక్రెట్‌ను బయటపెట్టేసిన రాహుల్ తెవాటియా.. మూడునాలుగేళ్లుగా ఆ పనిచేస్తున్నానంటూ..

ABN, First Publish Date - 2023-04-14T18:15:44+05:30

పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)-గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొహాలీ: పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)-గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. 154 పరుగుల ఓ మోస్తరు స్కోరును సాధించేందుకు గుజరాత్ టైటాన్స్ ఆపసోపాలు పడింది. చివరికి రాహుల్ తెవాటియా పుణ్యమా అని ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.

గుజరాత్ విజయానికి చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం. క్రీజులో తెవాటియా(Rahul Tewatia) ఉన్నాడు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల తెవాటియా స్కూప్ షాట్ ఆడి బంతిని బౌండరీకి తరలించాడు. ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు. రోజురోజుకు పరిణితి సాధిస్తున్న తెవాటియా జట్టుకు మూడో విజయాన్ని అందించాడు.

తెవాటియా తాజాగా తన ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మ్యాచ్ ఫినిషింగ్ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకుంటున్నదీ వివరించాడు. తాను ఆరు లేదంటే ఏడో నంబరులో బ్యాటింగ్‌కు దిగుతుంటాని, అప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని చేరుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. క్రికెటర్ పాత్ర గురించి తెలిస్తే అప్పుడు మరింత స్పష్టత వస్తుందన్నాడు. మంచి క్రికెట్ ఆడేందుకు అది సాయపడుతుందని తెవాటియా చెప్పుకొచ్చాడు.

రాత్రికి రాత్రే ఏమీ జరిగిపోదన్న తెవాటియా.. తాను 2020లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడినప్పుడు తనకీ పాత్ర లభించిందన్నాడు. మన రోల్ ఏంటనేది తెలిసినప్పుడు దానిపై మరింత స్పష్టత వస్తుందన్నాడు. 6-7 నంబరులో బ్యాటింగ్‌కు దిగినప్పుడు విపత్కర పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందన్నాడు. 14 మ్యాచుల్లో కనీసం 8-9సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెవాటియా పేర్కొన్నాడు.

ఇందుకోసం తాను గత మూడునాలుగేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పాడు. శిక్షణలోనే తనకు తానుగా టార్గెట్స్ సెట్ చేసుకుంటానని అన్నాడు. దీనివల్ల మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయాలన్న దానిపై ఓ అంచనా వస్తుందని పేర్కొన్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి రెండు బంతులకు నాలుగు పరుగులు అవసరమైన వేళ తెవాటియా పెద్ద సాహసమే చేశాడు. శామ్ కరన్ బౌలింగులో ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

దీని గురించి తెవాటియా మాట్లాడుతూ.. అది పెద్ద గ్రౌండ్ కావడంతో బంతిని లెగ్‌సైడ్‌కు బాది రెండు పరుగులు తీయొచ్చని భావించానని, అయితే ఇది కూడా కొంత రిస్కే అనిపించిందన్నాడు. రెండు బంతులే మిగిలి ఉండడంతో స్కూప్ షాట్ బెటర్ అని భావించి అలా చేశానని వివరించాడు.

Updated Date - 2023-04-14T18:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising