ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: 9వ తరగతి డ్రాపౌట్.. ఇప్పుడు కేకేఆర్ తురుపుముక్క!

ABN, First Publish Date - 2023-04-10T15:44:22+05:30

రింకు సింగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఇప్పుడీ పేరో సంచలనం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు ప్రాతినిధ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: రింకు సింగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఇప్పుడీ పేరో సంచలనం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్రాడు గుజరాత్‌ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో చేసిన ప్రదర్శన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. 26 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ యువ కెరటం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి ఓడిపోతున్న మ్యాచ్‌ను గెలిపించి అద్భుతం చేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌కు బ్రేకులేశాడు.

గుజరాత్ బౌలర్ యశ్ దయాళ్ (Yash Dayal) వేసిన చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 29 బంతులు అవసరమైన వేళ తొలి బంతికి సింగిల్ తీసిన ఉమేశ్ యాదవ్.. రింకు సింగ్‌(Rinku Singh)కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అది మొదలు స్టేడియంలో సిక్సర్ల వాన మొదలైంది. వరసపెట్టి సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని రింకూ హోరెత్తించాడు. క్రీజులో ఉండి రింకూ చేసిన ఈ విన్యాసం ఐపీఎల్ అభిమానులకు ఏళ్ల తరబడి మధురానుభూతిగా మిగిలిపోతుంది.

తొలుత కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు

అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్‌ను 2017లో అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అదరగొడుతూ ఉత్తరప్రదేశ్‌కు కీలక ఆటగాడిగా మారింది. 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రింకూను రూ. 80 లక్షలకు కొనుగోలు చేసిన తర్వాత అతడి అదృష్టం మారుతూ వచ్చింది.

2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రూ. 55 లక్షలతో రింకూను కేకేఆర్ రిటైన్ చేసుకుంది. రింకు సింగ్‌పై సురేశ్ రైనా (Suresh Raina) ప్రభావం చాలానే ఉంది. అతడి కెప్టెన్సీలోనే రింకు యూపీ జట్టు తరపున దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

తండ్రి సిలిండర్ల డెలివరీ

రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ర సింగ్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తుంటారు. అతడు పెద్దన్నయ్య ఆ ఆటోను నడుపుతుంటారు. 9 మంది ఉన్న రింకూ కుటుంబం రెండు గదుల ఇంటిలో నివసించేది. రింకూ అలానే పెరిగాడు. రింకూ తండ్రి నెలకు 6-7 వేల రూపాయలు సంపాదించేవారు. తన కుటుంబం కొంచెం పెద్దదని, దీంతో తనకు క్రికెట్‌పై దృష్టిపెట్టడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని రింకూ చెప్పుకొచ్చాడు.

స్వీపర్‌గా పనిచేసిన రింకూ

రింకూ సింగ్ ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేశాడు. 9వ తరగతి పరీక్షలు కూడా పూర్తి చేయలేకపోయాడు. స్కూల్ డ్రాపౌట్ అయ్యాక పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టిసారించాడు. క్రికెట్‌లో తానేంటో నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2022 తర్వాత రింకూ షైన్ కావడం మొదలైంది. అంతకుముందు కేకేఆర్ జట్టులో ఫిల్లర్‌గా మాత్రమే పనికొచ్చాడు. పూర్తిస్థాయిలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఫీల్డింగ్‌లో మాత్రం తరచూ మైదానంలో దిగేవాడు. బ్రహ్మాండమైన క్యాచ్‌లు పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022 మాత్రం అతడి కెరియర్‌ను మలుపుతిప్పింది.

గత సీజన్‌లో కేకేఆర్‌కు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాక రింకూ సింగ్‌కు గుజరాత్ టైటాన్స్‌పై ఆడే చాన్స్ వచ్చింది. అది కేకేఆర్‌కు ఆ సీజన్‌లో ఎనిమిదో మ్యాచ్. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై రింకూ 23 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేశాడు. అలాగే రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించిపెట్టాడు. ఐపీఎల్ సీజన్ ముగింపు సమయంలో రింకూ సింగ్‌పై కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు.

Updated Date - 2023-04-10T15:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising