ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LSG vs RCB: లక్నోపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. టాప్ స్పాట్‌పై లక్నో లుక్కు!

ABN, First Publish Date - 2023-05-01T19:23:42+05:30

ఐపీఎల్ (IPL 2023) లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. విజయం చివరి బంతి వరకు ఇరు జట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఐపీఎల్ (IPL 2023) లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. విజయం చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య ఊగిసలాడుతూ ప్రేక్షకులను ఊపిరి తీసుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు చివరి వరకు ఉత్కంఠ రేపాయి. మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ కూడా ఇలాంటి అనుభవాన్నే అందించబోతోంది. ఈ రెండు జట్లు గత మ్యాచుల్లో ఓడిపోయాయి. దీంతో ఇందులో విజయం సాధించడం ద్వారా గెలుపు పట్టాలు ఎక్కాలని కసిగా ఉన్నాయి.

ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు నాలుగు మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. లక్నో మాత్రం 8 మ్యాచుల్లో ఐదు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా టాప్ ప్లేస్‌కి చేరుకుంటుంది. ఫా డుప్లెసిస్ అందుబాటులోకి రావడంతో బెంగళూరు జట్టును మళ్లీ అతడే నడిపించనున్నాడు. జోష్ హేజిల్‌వుడ్, అనూజ్ రావత్ జట్టులోకి వచ్చారు. లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. అవేశ్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి వచ్చాడు.

Updated Date - 2023-05-01T19:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising