ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: తిలక్ వర్మ ఆడకుంటే ముంబై గతి ఏం కానూ.. బెంగళూరు ఎదుట భారీ విజయ లక్ష్యం!

ABN, First Publish Date - 2023-04-02T21:42:08+05:30

ముంబై అభిమానులందరూ తిలక్ వర్మ(Tilak Varma)కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. 48

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: ముంబై అభిమానులందరూ తిలక్ వర్మ(Tilak Varma)కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు తిలక్ వర్మ ఆపద్బాంధవుడిలా నిలిచాడు. సహచరులందరూ ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయి అసమాన పోరాటంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు(RCB) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ డుప్లెసిస్ నమ్మకానికి బౌలర్లు వమ్ము చేయకుండా వికెట్లు తీస్తూ ముంబైని కష్టాల్లోకి నెట్టేశారు. పూర్తి క్రమశిక్షణతో బంతులు వేస్తూ బ్యాటర్ల భరతం పట్టారు. తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా నిరాశ పరిచాడు. ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ (10), కేమరాన్ గ్రీన్ (5) తీవ్రంగా నిరాశ పరిచారు. ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ (15) కూడా ఉసూరుమనింపాడు.

అయితే, క్రీజులో పాతుకుపోయిన తిలక్ వర్మ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. థర్డ్ డౌన్‌లో వచ్చిన వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత ముంబై ఆపసోపాలు పడడం చూసి వంద పరుగులైనా చేస్తుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. వారి అనుమానాలను వర్మ పటాపంచలు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి జట్టు స్కోరును 170 దాటించాడు. నేహాల్ వధేరా 21 పరుగులు, అర్షద్ ఖాన్ 15 పరుగులు చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ముంబై 171 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కర్న్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్, రీస్ టోప్లే, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, మైఖేల్ బ్రాస్‌వెల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2023-04-02T21:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising