IPL 2023: వెంకటేశ్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఎలా అవుటయ్యాడో చూడండి!
ABN, First Publish Date - 2023-04-27T15:49:11+05:30
క్రికెట్‌లో క్యాచ్‌లు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డర్ ఒక్క క్యాచ్
బెంగళూరు: క్రికెట్‌లో క్యాచ్‌లు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డర్ ఒక్క క్యాచ్ వదిలేసినా, పట్టినా అది మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందుకనే ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని అంటూ ఉంటారు. ఇందుకు నిదర్శనమనించే ఘటన బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జరిగింది. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఓ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఫామ్‌లో ఉన్న బెంగళూరు స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వెనక్కి పంపాడు. కోహ్లీ కనుక అవుట్ కాకుండా మ్యాచ్ మరోలా ఉండేది.
ఈ ఘటన బెంగళూరు ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో జరిగింది. ఆండ్రీ రసెల్ (Andre Russel) వేసిన బంతిని కోహ్లీ బలంగా బాదాడు. అది కాస్తా డీప్ మిడ్ వికెట్ మీదుగా దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ మెరుపు వేగంతో స్పందించి క్యాచ్ అందుకున్నాడు.
గాల్లోంచి వేగంగా దూసుకొస్తున్న బంతిని చూసిన అయ్యర్ ఎడమవైపు అమాంతం దూకి బంతిని అందుకున్నాడు. అది చూసిన కోహ్లీ మాత్రమే కాదు, స్టేడియంలోని ప్రేక్షకులు కూడా షాకయ్యారు. అయ్యర్ క్యాచ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.
Updated Date - 2023-04-27T16:00:11+05:30 IST