IPL 2023: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’.. అతడేం చేస్తాడో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-30T16:13:14+05:30

అతిపెద్ద క్రికెట్ సంరంభం ఐపీఎల్(IPL 2023) మరొక్క రోజులో ప్రారంభం కాబోతోంది. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఆటను మరింత

IPL 2023: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’.. అతడేం చేస్తాడో తెలుసా?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: అతిపెద్ద క్రికెట్ సంరంభం ఐపీఎల్(IPL 2023) మరొక్క రోజులో ప్రారంభం కాబోతోంది. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఆటను మరింత రంజుగా మారుస్తున్న బీసీసీఐ(BCCI) ఈసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’(Impact Player) పేరుతో మరో రూల్‌ను తీసుకొచ్చింది. ఇది మనకు కొత్తే కానీ మామూలుగా చెప్పాలంటే మాత్రం పాతదే. దీనిని ఇప్పటికే ఆస్ట్రేలియాలోని ‘బిగ్ బాష్ లీగ్’(BBL)లో అమలు చేస్తున్నారు. సాధారణంగా ఇరు జట్లలోనూ 11 మంది చొప్పున ఆటగాళ్లు ఉంటారు. ఈ నిబంధనతో పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాన్ని బట్టి అదనంగా మరో ఆటగాడిని తీసుకోవచ్చు.

పేర్లు ముందే ఇచ్చెయ్యాలి

ఈ నిబంధన ప్రకారం ప్రతి జట్టు బౌలింగ్ సమయంలో కానీ, బ్యాటింగ్ సమయంలో కానీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను ఉపయోగించుకోవచ్చు. టీం షీట్స్‌ను సమర్పించినప్పుడే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్ల పేర్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారిలోంచి ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించుకోవచ్చు.

సాధారణ ఆటగాడిలానే..

ఇంపాక్ట్ ప్లేయర్ మైదానంలోకి వచ్చాక సాధారణ ఆటగాడిలానే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఏదైనా చేసుకోవచ్చు. అయితే, ఈ ఇంప్టాక్ట్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి. ఆయా ఫ్రాంచైజీలోని 11 మంది తుది ఆటగాళ్లలో నలుగురు కంటే తక్కువమంది విదేశీ ప్లేయర్లు ఉన్నప్పుడు మాత్రం ఇది వర్తించదు. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో విదేశీ ఆటగాడిని అనుమతించరు.

ఎప్పుడు తీసుకోవచ్చంటే?

ఇన్నింగ్స్ స్టార్ట్ కావడానికి ముందు కానీ, లేదంటే ఓవర్ పూర్తయ్యాక కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌ను పిలుచుకోవచ్చు. అదే బ్యాటింగ్ సమయంలో అయితే వికెట్ పోయిన తర్వాత కానీ, బ్యాటర్ రిటైర్ అవాలనుకున్నప్పుడు కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌ను పంపుకోవచ్చు. అయితే, అంతిమంగా మాత్రం 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇంపాక్ట్ ప్లేయర్ జట్టు కెప్టెన్‌గా ఉండడానికి మాత్రం అనర్హుడు.

Updated Date - 2023-03-30T16:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising