KL Rahul: ఐపీఎల్లో రాహుల్ రికార్డు.. అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా ఘనత
ABN, First Publish Date - 2023-04-22T18:14:10+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు సారథ్యం వహిస్తున్న కేఎల్
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్(KL Rahul) టీ20 క్రికెట్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. మహ్మద్ షమీ (Mohammed Shami) వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన రాహుల్ టీ20 క్రికెట్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. రాహుల్ 197 ఇన్నింగ్స్‌లలోనే 7 వేల టీ20 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 212, శిఖర్ ధావన్ 246, సురేశ్ రైనా 251, రోహిత్ శర్మ 258 ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు సాధించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా 47, హార్దిక్ పాండ్యా 66 పరుగులు చేశారు. అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. రాహుల్ 40, కృనాల్ పాండ్యా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Updated Date - 2023-04-22T18:16:44+05:30 IST