ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab Kings: ఐపీఎల్‌కు ముందు భారీ ఎదురుదెబ్బ!

ABN, First Publish Date - 2023-03-23T19:37:43+05:30

ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు భారీ ఎదురుదెబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow) ఐపీఎల్‌కు దూరమైనట్టు తెలుస్తోంది.. అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) నిరాకరించింది. దీంతో ఈ 33 ఏళ్ల ఇంగ్లండ్ బ్యాటర్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు దూరమైనట్టే. గతేడాది సెప్టెంబరులో బెయిర్‌స్టో కాలికి గాయమైంది. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ మరో ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్‌కు మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు ఈసీబీ అనుమతి ఇచ్చింది. లివింగ్‌స్టోన్‌( Livingstone)ను రూ. 11.50 కోట్లకు, బెయిర్‌స్టోను రూ. 6.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. కాగా, బెయిర్‌స్టో దూరమైతే అతడి స్థానాన్ని ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో భరీ చేసే అవకాశం ఉంది.

బెయిర్‌స్టో జట్టుకు దూరం కావడం పంజాబ్‌కు పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. బెయిర్‌స్టో గతేడాది ఆగస్టు నుంచి ఆడడం లేదు. గాయం కారణంగా అతడికి ఎన్ఓసీ ఇచ్చేందుకు ఈసీబీ నిరాకరించింది. దీనికి తోడు జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ మొదలు కానుంది. దీంత ఆ సిరీస్‌ నాటికి బెయిర్‌స్టో పూర్తిగా కోలుకోవాలని భావిస్తోంది.

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుకెక్కిన శామ్ కరన్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. కరన్‌ను పంజాబ్ రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. మిగతా ఇంగ్లండ్ ప్లేయర్లలో జోఫ్రా అర్చర్ (MI), మార్క్‌ వుడ్ (LSG), బెన్ స్టోక్స్ (CSK) వంటివారికి ఎన్ఓసీ లభించడంతో వారంతా వారివారి ఫ్రాంచైజీల తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

ఐపీఎల్ 16వ ఎడిషన్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

ఐపీఎల్‌లో ఆడనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు వీరే..

శామ్ కరన్ (Punjab Kings), బెన్‌స్టోక్స్ (Chennai Super Kings), హారీ బ్రూక్(Sunrisers Hyderabad), ఫిల్ సాల్ట్ (Delhi Capitals), రీస్ టోప్లే (Royal Challengers Bangalore), అదిల్ రషీద్ (Sunrisers Hyderabad), జో రూట్ (Rajasthan Royals), లియామ్ లివింగ్ స్టోన్ (Punjab Kings), జాన్ బెయిర్‌స్టో (Punjab Kings), మొయిన్ అలీ (Chennai Super Kings), జోఫ్రా అర్చర్ (Mumbai Indians), జోస్ బట్లర్ (Rajasthan Royals), డేవిడ్ విల్లీ (Royal Challengers Bangalore), మార్క్ వుడ్ (Lucknow Super Giants)

Updated Date - 2023-03-23T20:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising