IPL 2023: ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన ఏడో బౌలర్‌గా షమీ
ABN, First Publish Date - 2023-03-31T21:18:18+05:30
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ తొలి పోరులో గుజరాత్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డెవోన్ కాన్వేను అవుట్ చేయడంతో ఈ రికార్డు షమీ సొంతమైంది.
షమీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి కాన్వే డకౌట్ అయ్యాడు. ఆరు బంతులు ఆడిన కాన్వే ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. 32 ఏళ్ల షమీ తన 94వ మ్యాచ్‌లో వందో వికెట్ పడగొట్టాడు. ఇక, తాజా మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించి, సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిశాయి. చెన్నై 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గైక్వాడ్ 92, దూబే 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Updated Date - 2023-03-31T21:18:18+05:30 IST