ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం.. ఇక తట్టాబుట్టా సర్దేయాల్సిందే!

ABN, First Publish Date - 2023-10-28T22:01:13+05:30

వరల్డ్‌కప్ 2023 మెగా టోర్నీలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలయ్యింది. అవును.. ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఆ పసికూన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది..

వరల్డ్‌కప్ 2023 మెగా టోర్నీలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలయ్యింది. అవును.. ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఆ పసికూన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు నిర్దేశించిన 230 పరుగులను కూడా బంగ్లా ఛేధించలేకపోయింది. 142 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో.. 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు పూర్తిగా నీరుగారిపోయాయి. ఇక ఆ జట్టు ఈ టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దేయాల్సిందే.


ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత నెదర్లాండ్స్ టాస్ గెలవగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. 42.2 ఓవర్లో 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిజానికి.. లక్ష్యం చిన్నదే కావడం, నెదర్లాండ్స్ కన్నా బంగ్లా జట్టుకి ఎక్కువ అనుభవం ఉండటంతో.. బంగ్లాదేశ్ సునాయాసంగా ఈ మ్యాచ్ గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. పైగా.. బంగ్లాకి ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి, తప్పకుండా గెలిచే తీరుతారని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా ఈ జట్టు పేకమేడలా కుప్పకూలిపోయింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. ఒక్క మెహదీ హసన్ మాత్రమే 35 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. దీన్ని బట్టి.. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఎంత చెత్త ప్రదర్శన కనబరిచారో అర్థం చేసుకోవచ్చు.

మొదట్లో 19 పరుగులకే బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హసన్, శాంటో కలిసి నిలకడగా రాణించే ప్రయత్నం చేశారు. వీళ్ల ఆటతీరు చూసి.. ఇక క్రీజులో కుదురుకున్నట్టేనని అంతా భావించారు. కానీ.. ఇంతలోనే వీళ్లు కూడా చేతులు ఎత్తేశారు. ఇక అప్పటి నుంచి ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఎవ్వరిలోనూ బాగా ఆడి, తమ జట్టుని గెలిపించాలన్న కసి కనిపించలేదు. దీంతో.. 142 పరుగులకే బంగ్లా జట్టు చాపచుట్టేసింది. ఇక నెదర్లాండ్స్ బౌలర్ల విషయానికొస్తే.. పాల్ వాన్ మీకెరన్ 4 వికెట్లు తీసి, బంగ్లా బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. లీడే రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్, బీక్, కోలిన్ తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో పాల్ వాన్ మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated Date - 2023-10-28T22:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising