Tilak Varma: ముంబై లాంటి జట్టుకు ఆడితే వచ్చే కిక్కే వేరప్పా!

ABN, First Publish Date - 2023-04-11T20:39:41+05:30

గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు మంచి ముగింపు ఇవ్వడంలో విఫలమయ్యానని ముంబై

Tilak Varma: ముంబై లాంటి జట్టుకు ఆడితే వచ్చే కిక్కే వేరప్పా!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు మంచి ముగింపు ఇవ్వడంలో విఫలమయ్యానని ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుత సీజన్‌లో మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. గత సీజన్‌లో అతడిపై మంచి హోప్సే ఉన్నప్పటికీ ఆకట్టుకోవడంలో కొన్ని మ్యాచుల్లో విఫలమయ్యాడు. 2022 సీజన్‌లో ముంబై దారుణ పరాభావాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంలోనూ విఫలమైంది. ఈ సీజన్‌లో తాను కొంచెం నిలకడగా రాణించాలనుకుంటున్నట్టు తిలక్ వర్మ చెప్పాడు.

తొలి మ్యాచ్‌లో క్లిక్కయితే ఆ మజానే వేరని, ఆ ఆత్మవిశ్వాసం మిగతా మ్యాచ్‌లకు కూడా ఎంతగానో పనికొస్తుందన్నాడు. ఇకపై జట్టుకు విజయాలు అందించడలో కీలక పాత్ర పోషించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నాడు. గత సీజన్ తనకు మొదటిదని, తొలుత బాగానే ఆడినా, ఆ తర్వాత కొన్ని మ్యాచుల్లో విఫలమయ్యానన్నాడు. కాబట్టి మరింత బాగా బ్యాటింగ్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పాడు.

ముంబై లాంటి జట్టుకు ఆడి పరుగులు రాబడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరేగా ఉంటాయన్నాడు. అయితే, నిలకడ ముఖ్యమన్నాడు. భాగస్వామ్యాలు బాగానే ఉన్నప్పటికీ భారీ స్కోరు సాధించడం అవసరమని తిలక్ వర్మ అన్నాడు. తిలక్ వర్మ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి 106 పరుగులు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది.

Updated Date - 2023-04-11T20:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising