ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CSK vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. చివరి బంతికి గెలిపించిన రజా

ABN, First Publish Date - 2023-04-30T19:45:54+05:30

నరాలు తెగే మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికైంది. చెన్నై సూపర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నరాలు తెగే మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికైంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK)-పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన ఈ మ్యాచ్ టీ20ల్లోని అసలైన మజాను పంచింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చెన్నై నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ చివరి బంతికి మూడు పరుగులు తీసి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పంజాబ్ విజయానికి చివరి రెండు బంతులకు ఐదు పరుగులు అవసరం కాగా, పథిరన వేసిన ఐదో బంతికి సికిందర్ రజా రెండు పరుగులు చేశాడు. ఇక, చివరి బంతికి మూడు పరుగులు అవసరం. రెండు పరుగులు చేస్తే సూపర్ ఓవర్ అవసరం అవుతుంది.

అందరూ సూపర్ ఓవర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించారు. అయితే, రజా మ్యాజిక్ చేశాడు. పథిరన తెలివిగా సంధించిన స్లో బాల్‌ను రజా బలంగా బాదాడు. అది కాస్తా గాల్లోకి లేచి బ్యాక్‌వార్డ్ స్క్వేర్‌ లెగ్‌లో పడి బౌండరీ వైపుగా దూసుకెళ్లింది. తీక్షణ ఛేజ్ చేసి బంతి బౌండరీకి వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతిని బాదిన రజా మూడు పరుగులు తీసేశాడు. అంతే.. పంజాబ్ శిబిరంలో సంబరాలు కనిపిస్తే.. చెన్నై శిబిరంలో మౌనం రాజ్యమేలింది.

ఈ మ్యాచ్‌లో తొలు బ్యాటింగ్ చేసిన చెన్నై కాన్వే వీరబాదుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్‌తో 92 పరుగులు చేశాడు.

అనంతరం 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 42 (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), లియామ్ లివింగ్ స్టోన్ 40 (24 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లు), శామ్ కరన్ 29 (20 బంతుల్లో ఫోర్, సిక్సర్), జితేశ్ శర్మ 21 (10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్) పరుగులు చేశారు.

Updated Date - 2023-04-30T20:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising