ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ajit Agarkar: చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ జీతం ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-05T14:58:46+05:30

చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ అందుకునే జీతంపై ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. అతడి వార్షిక వేతనం రూ.3 కోట్లు అని క్రిక్ బజ్ వెల్లడించింది. అగార్కర్ ముందు వరకు చీఫ్ సెలక్టర్ వార్షిక జీతం రూ.కోటి ఉండగా ప్రస్తుతం బీసీసీఐ దాన్ని మూడింతలు పెంచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా పురుషుల జట్టు నూతన చీఫ్ సెలక్టర్‌గా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నియామకం అయ్యాడు. ఈ మేరకు ఈ విషయాన్ని మంగళవారం రాత్రి బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. చేతన్ శర్మ రాజీనామాతో సెలక్షన్ కమిటీలో ఒక పోస్టు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు కోసం పలువురు మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా అగార్కర్‌కు ఈ పదవి దక్కింది. గతంలో భారత జట్టు తరఫున అగార్కర్ ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలర్‌గా కీలక వికెట్లు సాధించి విజయాలను అందించాడు. అగార్కర్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అతడికి చీఫ్ సెలక్టర్ బాధ్యతలను అప్పగించింది.

ఇది కూడా చదవండి: టీమిండియా మాజీ క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

అయితే చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్ అందుకునే జీతంపై ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. అతడి వార్షిక వేతనం రూ.3 కోట్లు అని క్రిక్ బజ్ వెల్లడించింది. అగార్కర్ ముందు వరకు చీఫ్ సెలక్టర్ వార్షిక జీతం రూ.కోటి ఉండగా ప్రస్తుతం బీసీసీఐ దాన్ని మూడింతలు పెంచింది. రూ.కోటి జీతం మాత్రమే ఉండటంతో దిగ్గజ ఆటగాళ్లు చీఫ్ సెలక్టర్ పదవి చేపట్టేందుకు ముందుకు రావడం లేదని బీసీసీఐ భావించిందని.. దీంతో ఇప్పుడు శాలరీని భారీగా పెంచినట్లు క్రిక్ బజ్ అభిప్రాయపడింది. కాగా ఆరంభంలో అజిత్ అగార్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందనే ఆరోపణతో ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించాడని క్రిక్ బజ్ పేర్కొంది. కాగా చీఫ్ సెలక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచినట్లు సమాచారం.

Updated Date - 2023-07-05T14:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising