కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: పుజారా, రహానె లేకుండానే బరిలోకి.. 2006 తర్వాత ఇదే తొలిసారి

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:36 PM

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో 17 ఏళ్ల తర్వాత పుజారా, రహానెలలో ఒక్కరు కూడా లేకుండా టీమిండియా టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.

SA Vs IND: పుజారా, రహానె లేకుండానే బరిలోకి.. 2006 తర్వాత ఇదే తొలిసారి

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా మిడిలార్డర్‌కు వెన్నెముకగా ఉంటున్న పుజారా, రహానె స్థానంలో యషస్వీ జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నారు. అయితే పుజారా, రహానెలలో ఒక్కరు కూడా లేకుండా ఇటీవల కాలంలో భారత్ టెస్టులు ఆడటం లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో 17 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరిలో ఒక్కరు కూడా లేకుండా టీమిండియా టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.

ఇంకా చెప్పాలంటే టెస్టు అరంగేట్రం తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌కు పుజారా, రహానె దూరమవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. 2022లో సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. కానీ పుజారా, రహానె దేశవాళీలో సత్తా చాటి తిరిగి జట్టులోకి వచ్చారు. కానీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. 2022లో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ సమయంలో మూడు మ్యాచ్‌ల్లో రహానె 22.66 సగటుతో 136 పరుగులు, పుజారా 20.66 సగటుతో 124 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 26 , 2023 | 02:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising