ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Attack On KL Rahul: ఎట్టకేలకు మౌనం వీడిన వెంకటేశ్ ప్రసాద్

ABN, First Publish Date - 2023-03-21T18:31:39+05:30

ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా బ్యాటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)పై మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్(Vekatesh Prasad) ఇటీవల చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మౌనం వీడిన వెంకటేశ్ ప్రసాద్.. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ రాహుల్ 25 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. దీంతో అతడి స్థానాన్ని ఆ తర్వాత శుభమన్ గిల్‌తో భర్తీ చేశారు. రాహుల్‌పై వెంకటేశ్ ప్రసాద్ చేసిన విమర్శలతో చాలా మంది ఏకీభవించారు.

అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓటమి అంచుల్లోకి వెళ్లిపోతున్న జట్టును రాహుల్ అద్భుత ఆటతీరుతో గెలిపించాడు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అప్పటి వరకు వెంకటేశ్ ప్రసాద్‌కు అండగా నిలిచిన వారు ఈసారి యూటర్న్ తీసుకుని రాహుల్‌కు మద్దతు పలకడం మొదలెట్టారు. దీంతో వెంకటేశ్ ప్రసాద్ ఒంటరివాడయ్యాడు.

తాజాగా, వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాహుల్‌పై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్న వెంకటేశ్ ప్రసాద్.. తాను అనుకున్నదే చెప్పానని పేర్కొన్నాడు. కొంతమంది దానిని స్వీకరిస్తే, కొందరు వ్యతిరేకించారన్నాడు. అది వారిష్టమని తేల్చి చెప్పాడు. తాను రాహుల్ ఒక్కడి గురించే మాట్లాడలేదని, సర్ఫరాజ్ అహ్మద్‌ ప్రదర్శనపై తన అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపాడు. తాను గీత దాటలేదన్న విషయం తనకు తెలుసన్నాడు. అయితే కొందరు దానిని తీవ్రంగా తీసుకున్నారని, మరికొందరు విమర్శలు చేశారని చెప్పుకొచ్చాడు.

ముంబై వన్డేలో రాహుల్ అర్ధ సెంచరీ చేశాక తొలుత స్పందించింది మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాదే. భారత జట్టును గెలిపించాడంటూ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ అంటే తనకెంతో గౌరవం ఉందన్న వెంకటేశ్.. అండర్-16 రోజుల నుంచి అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి రాహుల్ తనకు తెలుసన్నాడు. కర్ణాటక తరపున ఇద్దరం వివిధ స్థాయిల్లో పనిచేసినట్టు వివరించారు. అలాగే, భారత జట్టులోనూ కలిసి పనిచేశామన్నాడు. అతడిలో చాలా నైపుణ్యం ఉందని, కానీ పూర్తిస్థాయిలో దానిని అందుకోలేకపోతున్నాడని చెప్పాడు. మున్ముందు మరింత బాగా ఆడతాని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు.

Updated Date - 2023-03-21T18:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising