ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WC Afganistan vs England : చాంపియన్‌ను చిత్తు చేశారు

ABN, First Publish Date - 2023-10-16T03:10:23+05:30

అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే చిర్మసరణీయ రోజు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 14 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల ఓటములతో నిస్పృహ ఆవరించిన వేళ.. ఏకంగా డిఫెండింగ్‌

అఫ్ఘానిస్థాన్‌ సంచలన విజయం

69 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి

అఫ్ఘానిస్థాన్‌ ప్రత్యర్థి డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌. ఏముందిలే.. ఇదీ ఏకపక్ష మ్యాచ్‌గానే ముగస్తుందని చాలామంది భావించి ఉంటారు. కానీ బరిలోకి దిగాక అఫ్ఘాన్‌ వీరులు పెను సంచలనమే నమోదు చేశారు. మొదట ఓపెనర్‌ గుర్బాజ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థికి సవాల్‌ విసిరే స్కోరుకు బాటలు వేయగా, అనంతరం స్పిన్‌ త్రయం ముజీబ్‌, రషీద్‌, నబీ సుడులు తిరిగే బంతులతో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌కు పెవిలియన్‌ దారి చూపించారు. ఫలితం..వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అఫ్ఘాన్లు రెండో విజయంతో ఆకాశాన్నంటే సంబరాలు చేసుకున్నారు.

వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అఫ్ఘాన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు తొలిసారిగా 2015లో స్కాట్లాండ్‌పై గెలిచింది.

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే చిర్మసరణీయ రోజు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 14 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల ఓటములతో నిస్పృహ ఆవరించిన వేళ.. ఏకంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌నే మట్టికరిపించింది. తమకన్నా ఎన్నోరెట్లు బలంగా కనిపిస్తున్న ప్రత్యర్థిపై బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో విశేషంగా రాణిస్తూ 69 పరుగుల తేడాతో టోర్నీలో పాయింట్ల ఖాతా తెరిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా అఫ్ఘానిస్థాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80), ఇక్రామ్‌ అలిఖిల్‌ (66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58) అర్ధసెంచరీలు సాధించగా.. చివర్లో ముజీబుర్‌ రహ్మాన్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28), రషీద్‌ ఖాన్‌ (22 బంతుల్లో 3 ఫోర్లతో 23) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆదిల్‌కు 3, ఉడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్‌ (61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 66), డేవిడ్‌ మలాన్‌ (39 బంతుల్లో 4 ఫోర్లతో 32) రాణించారు. రషీద్‌, ముజీబ్‌లకు మూడేసి, నబీకి రెండు వికెట్లు దక్కా యి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ముజీబ్‌ నిలిచాడు.

స్పిన్‌ ఉచ్చులో విలవిల: రాత్రి వేళలో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి ఛేజింగ్‌ సులువవుతుందనుకున్న ఇంగ్లండ్‌ వ్యూహం బెడిసికొట్టింది. 285 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన చాంపియన్‌ను అఫ్ఘాన్‌ స్పిన్నర్లు చావుదెబ్బ తీశారు. మిడిలార్డర్‌లో బ్రూక్‌ ఒక్కడే దీటుగా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ బెయిర్‌స్టో (2)ను ఫరూఖి అవుట్‌ చేశాడు. అనంతరం జో రూట్‌ (11)ను ముజీబ్‌ బౌల్డ్‌ చేయడంతో పవర్‌ప్లేలోనే ఇంగ్లండ్‌ 2 వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ మలాన్‌ 4 ఫోర్లతో కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ స్పిన్నర్‌ నబీ 13వ ఓవర్‌లో మలాన్‌ను పెవిలియన్‌ చేర్చి షాకిచ్చాడు. కాసేపటికే బట్లర్‌ (9), లివింగ్‌స్టోన్‌ (10), సామ్‌ కర్రాన్‌ (10)లు కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 138/6 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. మరో ఎండ్‌లో బ్రూక్‌ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగం కనబర్చాడు. కానీ అతడికి సహకారమే కరువైంది. వోక్స్‌ (9)ను ముజీబ్‌ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. అయినా క్రీజులో బ్రూక్‌ ఉండడంతో ఇంగ్లండ్‌ ఆశలను వదులుకోలేదు. కానీ 35వ ఓవర్‌లో ముజీబ్‌ అతిపెద్ద ఝలక్‌ ఇచ్చాడు. క్యారమ్‌ బాల్‌తో బ్రూక్‌ను అవుట్‌ చేయడంతోనే అఫ్ఘాన్‌ విజయ సంబరాలు చేసుకుంది. కీపర్‌ అలిఖిల్‌ మెరుపు వేగంతో స్పందించి ఈ క్యాచ్‌ తీసుకున్నాడు. అనంతరం చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదిల్‌ (20), ఉడ్‌ (18), టాప్లీ (15 నాటౌట్‌) వేగంగా ఆడినా, ఓటమి తేడాను మాత్రమే తగ్గించగలిగారు.

ఆదుకున్న గుర్బాజ్‌, అలిఖిల్‌: ఆరంభంలో దూకుడు.. మధ్య ఓవర్లలో వికెట్ల పతనం.. చివర్లో తిరిగి పోటీలోకి.. ఇదీ ఇంగ్లండ్‌పై అఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ తీరు. ప్రత్యర్థి జట్టులోని ప్రపంచస్థాయి బౌలర్లకు ఓపెనర్‌ గుర్బాజ్‌ చుక్కలు చూపాడు. మైదానం నలువైపులా చక్కటి షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇక చివర్లోనూ అలిఖిల్‌ సహాయంతో జట్టు పుంజుకుని పరుగులు రాబట్టింది. అయితే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ తొలి రెండు ఓవర్లలో చేసింది 7 పరుగులే. కానీ ముందుగా వోక్స్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన గుర్బాజ్‌.. కర్రాన్‌ను వదలకుండా వరుసగా రెండు ఫోర్లు, సిక్స్‌ రాబట్టాడు. ఇతడిని కట్టడి చేసేందుకు కెప్టెన్‌ బట్లర్‌ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. మార్క్‌వుడ్‌, స్పిన్నర్‌ ఆదిల్‌ ఓవర్లలోనూ ఒక్కో సిక్సర్‌ సాధించాడు. ఈ ధాటికి అఫ్ఘాన్‌ పవర్‌ప్లేలో అత్యధికంగా 79 పరుగులు చేసింది. అటు మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (28) సహకారం అందించడంతో అఫ్ఘాన్‌ స్కోరు 13 ఓవర్లలోనే 102 పరుగులకు చేరింది. అయితే ఆ జట్టు జోరుకు కళ్లెం వేస్తూ 17వ ఓవర్‌లో జద్రాన్‌ను ఆదిల్‌ అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి అఫ్ఘాన్‌ తడబాటుకు గురైంది. 19వ ఓవర్‌లో రహ్మత్‌ (3)ను కూడా ఆదిల్‌ అవుట్‌ చేయగా తర్వాతి బంతికే గుర్బాజ్‌ రనౌటయ్యాడు. తర్వాత అజ్మతుల్లా (19), షాహిది (14), నబీ (9) త్వరగానే నిష్క్రమించడంతో జట్టు 190/6తో నిలిచింది. ఈ దశలో అలిఖిల్‌ నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతను రషీద్‌తో ఏడో వికెట్‌కు 43 పరుగులు, ముజీబ్‌తో ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించడం కలిసొచ్చింది. చివర్లో ముజీబ్‌ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో మరో బంతి ఉండగానే జట్టు ఆలౌటైనా, ఇంగ్లండ్‌కు ఈ పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోరును ముందుంచింది.

వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్‌ జట్టుకిది రెండో ఉత్తమ స్కోరు (284). గతంలో విండీ్‌సపై 288 రన్స్‌ సాధించింది.

ఓ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లను స్పిన్నర్లకు కోల్పోవడం ఇంగ్లండ్‌కిదే తొలిసారి.

అఫ్ఘాన్‌ తరఫున వరల్డ్‌కప్‌ టోర్నీలో ఎక్కువ వికెట్లు (15) తీసిన బౌలర్‌గా నబీ.

స్కోరుబోర్డు

అఫ్ఘానిస్థాన్‌: గుర్బాజ్‌ (రనౌట్‌) 80; ఇబ్రహీం జద్రాన్‌ (సి) రూట్‌ (బి) ఆదిల్‌ 28; రహ్మత్‌ (స్టంప్‌) బట్లర్‌ (బి) ఆదిల్‌ రషీద్‌ 3; షాహిది (బి) రూట్‌ 14; అజ్మతుల్లా (సి) వోక్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 19; అలిఖిల్‌ (సి) సామ్‌ కర్రాన్‌ (బి) టాప్లీ 58; నబీ (సి) రూట్‌ (బి) ఉడ్‌ 9; రషీద్‌ (సి) రూట్‌ (బి) ఆదిల్‌ 23; ముజీబ్‌ (సి) రూట్‌ (బి) ఉడ్‌ 28; నవీన్‌ ఉల్‌ హక్‌ (రనౌట్‌) 5; ఫరూఖి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 49.5 ఓవర్లలో 284 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-114, 2-122, 3-122, 4-152, 5-174, 6-190, 7-233, 8-277, 9-277, 10-284. బౌలింగ్‌: వోక్స్‌ 4-0-41-0; టాప్లీ 8.5-1-52-1; సామ్‌ కర్రాన్‌ 4-0-46-0; ఆదిల్‌ రషీద్‌ 10-1-42-3; ఉడ్‌ 9-0-50-2; లివింగ్‌స్టోన్‌ 10-0-33-1; రూట్‌ 4-0-19-1.

ఇంగ్లండ్‌: బెయిర్‌స్టో (ఎల్బీ) ఫరూఖి 2; మలాన్‌ (సి) జద్రాన్‌ (బి) నబీ 32; రూట్‌ (బి) ముజీబ్‌ 11; బ్రూక్‌ (సి) ఇక్రమ్‌ (బి) ముజీబ్‌ 66; బట్లర్‌ (బి) నవీన్‌ ఉల్‌ హక్‌ 9; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) రషీద్‌ ఖాన్‌ 10; సామ్‌ కర్రాన్‌ (సి) రహ్మత్‌ (బి) నబీ 10; వోక్స్‌ (బి) ముజీబ్‌ 9; ఆదిల్‌ (సి) నబీ (బి) రషీద్‌ 20; ఉడ్‌ (బి) రషీద్‌ 18; టాప్లీ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 40.3 ఓవర్లలో 215 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-3, 2-33, 3-68, 4-91, 5-117, 6-138, 7-160, 8-169, 9-198, 10-215.బౌలింగ్‌: ముజీబ్‌ 10-1-51-3; ఫరూఖి 7-0-50-1; నవీన్‌ ఉల్‌ హక్‌ 6-1-44-1; నబీ 6-0-16-2; రషీద్‌ ఖాన్‌ 9.3-1-37-3; అజ్మతుల్లా 2-0-13-0.

3 అఫ్ఘాన్‌ తరఫున ఏ వికెట్‌కైనా వరల్డ్‌కప్‌లో మూడో ఉత్తమ భాగస్వామ్యాన్ని (114) అందించిన జోడీగా గుర్బాజ్‌-జద్రాన్‌

Updated Date - 2023-10-16T08:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising