RCB: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్!
ABN, First Publish Date - 2023-03-16T18:51:42+05:30
సీజన్ల మీద సీజన్లు గడిచిపోతున్నా ట్రోఫీ కలగానే మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఈ సీజన్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది
బెంగళూరు: సీజన్ల మీద సీజన్లు గడిచిపోతున్నా ట్రోఫీ కలగానే మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఈ సీజన్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్(Will Jacks) జట్టుకు దూరమయ్యాడు. కండరాల గాయంతో బాధపడుతున్న జాక్స్ ఐపీఎల్(IPL)కు పూర్తిగా దూరమైనట్టు తెలుస్తోంది. దీంతో అతడి స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్(Michael Bracewell)తో భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది.
జాక్స్‌ను ఆర్సీబీ రూ. 3.2 కోట్లతో వేలంలో కొనుగోలు చేసింది. ఫలితంగా మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కండర గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువ ఉన్నట్టు పరీక్షల్లో తేలడంతో ఐపీఎల్ నుంచి కూడా తప్పకున్నాడు.
ఇటీవల లీగుల్లో అదరగొట్టిన జాక్ ఆర్సీబీకి మంచి బలమవుతాడని అందరూ భావించారు. అయితే, ఇప్పుడు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడం ఆర్సీబీకి పెద్ద దెబ్బే. కాగా, కోటి రూపాయల కనీస ధరతో వేలంలో పాల్గొన్నప్పటికీ బ్రాస్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఆర్సీబీతో చర్చలు ఫలిస్తే ఐపీఎల్ కోసం వచ్చేస్తాడు.
ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న ముంబైతో ఆడుతుంది. కాగా, ఐపీఎల్‌కు దూరం కావడం విల్ జాక్స్‌కు కూడా వ్యక్తిగతంగా నష్టమే. ఐపీఎల్‌లో దుమ్మురేపడం ద్వారా భారత పరిస్థితులకు అలవాటు పడాలని, తద్వారా ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాలని భావించాడు. ఇప్పడు అతడి ఆశలు అడియాసలైనట్టే.
Updated Date - 2023-03-16T18:59:19+05:30 IST