Womens T20 World Cup : భారత అమ్మాయిల కప్పు కల నెరవేరేనా?
ABN, First Publish Date - 2023-02-10T03:48:41+05:30
ఐసీసీ ఈవెంట్లలో ఎదురులేని ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉండగా.. కంగారూల ఆధిపత్యానికి ఎలాగైనా గండికొట్టాలని భారత్, ఇంగ్లం డ్ వ్యూహాలు రచిస్తున్నాయి. 10 దేశాలు పాల్గొంటున్న మహిళల టీ20 వరల్డ్‌క్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో
ఆశావహంగా హర్మన్‌సేన
ఫేవరెట్ ఆస్ట్రేలియా
బలంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్
నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్
నేటి మ్యాచ్(స్టార్ నెట్‌వర్క్‌లో)
సౌతాఫ్రికా ్ఠ శ్రీలంక రాత్రి 10.30 నుంచి
కేప్‌టౌన్: ఐసీసీ ఈవెంట్లలో ఎదురులేని ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉండగా.. కంగారూల ఆధిపత్యానికి ఎలాగైనా గండికొట్టాలని భారత్, ఇంగ్లం డ్ వ్యూహాలు రచిస్తున్నాయి. 10 దేశాలు పాల్గొంటున్న మహిళల టీ20 వరల్డ్‌క్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఆతిథ్య సౌతాఫ్రికా తలపడనుంది. ఈ నెల 23, 24 తేదీల్లో సెమీస్, 26న టైటిల్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ చాంప్ ఆసీస్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. మిగతా జట్ల ఆట కూడా ఎంతో మెరుగుపడడంతో మెగా ఈవెంట్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
జూనియర్ల స్ఫూర్తితో..: గత వరల్డ్‌కప్‌లో అనూహ్య ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత్.. రన్నర్‌పగా సరిపెట్టుకొంది. అయితే, ఈసారి మాత్రం అండర్-19 వరల్డ్‌కప్ జట్టు స్ఫూర్తితో టైటిల్ నెగ్గాలని హర్మన్‌ప్రీత్ సేన్ పట్టుదలతో ఉంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆటతీరు ఎంతో మెరుగుపడింది. ఆసీస్, ఇంగ్లం డ్ లాంటి జట్లతో ఢీ అంటే ఢీ అనేలా కనిపిస్తున్న భారత విజయాల్లో బ్యాటింగ్ విభాగానిదే కీలకపాత్ర. ఓపెనర్లు స్మృతి మంధాన, చిచ్చరపిడుగు షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్నిస్తే భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. హర్మన్, రిచా ఘోష్ ఫినిషర్‌గా అదరగొడతారు. అండర్-19 టీమ్‌కు పొట్టికప్ అందించిన షఫాలీ, రిచా సీనియర్ జట్టులోనూ అదే తరహా పాత్రను పోషించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే, పేస్ విభాగంలో శిఖా పాండే మినహా మిగతా వారిని అనుభవం లేకపోవడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ జట్టుకు కీలకం. గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. నాకౌట్‌లో తడబడే అలవాటును అధిగమిస్తే.. టీమిండియా తొలి ప్రపంచక్‌పను సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హీథర్‌నైట్ సారథ్యంలోని ఇంగ్లిష్ టీమ్ కూడా ఎంతో బలంగా కనిపిస్తోంది. 2009లో తొలి టోర్నీలో విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెండుసార్లు టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లినా నిరాశే ఎదురైంది. గ్రూప్-ఎలో ఆసీ్‌సతోపాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక ఆడనున్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.
‘సిక్సర్’పై కంగారూల గురి: ఇప్పటివరకూ ఏడుసార్లు టోర్నీ జరగ్గా, ఐదుసార్లు పొట్టి కప్‌ను సొంతం చేసుకొన్న ఆసీస్ డబుల్ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. 2020లో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ రీఎంట్రీతో బ్యాటింగ్ మరింతగా బలపడగా.. లోయరార్డర్‌లో పవర్ హిట్టర్ ఆష్లే గార్డ్‌నర్ ప్రమాదకరంగా తయారైంది. అయితే, భారత్‌తో జరిగిన సిరీ్‌సలో ఎంతో కష్టపడిన ఆసీస్.. వామప్ మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడింది.
Updated Date - 2023-02-10T03:48:43+05:30 IST