Damodar as IPL Manager :ఐపీఎల్ ఆపరేషన్స్ మేనేజర్‌గా దామోదర్
ABN, First Publish Date - 2023-03-18T02:31:17+05:30
ఐపీఎల్ జోనల్ ఆపరేషన్స్ మేనేజర్ (జెడ్‌ఓఎం)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ. దామోదర్‌ను బీసీసీఐ నియమించింది. మొత్తం ముగ్గురు ..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐపీఎల్ జోనల్ ఆపరేషన్స్ మేనేజర్ (జెడ్‌ఓఎం)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ. దామోదర్‌ను బీసీసీఐ నియమించింది. మొత్తం ముగ్గురు ఆపరేషన్స్ మేనేజర్లను నియమించగా, అందులో దామోదర్‌కు కూడా అవకాశం లభించింది. ఈనెల 31 నుంచి జరుగనున్న ఐపీఎల్‌లో 20కి పైగా మ్యాచ్‌లకు దామోదర్ ఆపరేషన్స్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది వేదికల్లో జరగనున్న మ్యాచ్‌లకు ఆయన జెడ్‌ఓఎంగా సేవలందించనున్నారు.
Updated Date - 2023-03-18T02:31:17+05:30 IST