ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhanush Srikanth : అసాధ్యుడు

ABN, First Publish Date - 2023-07-19T02:24:00+05:30

ధనుష్‌ శ్రీకాంత్‌.. అంతర్జాతీయ షూటింగ్‌లో ఈ పేరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌. 21 ఏళ్ల ఈ బధిర షూటర్‌ గతేడాది జరిగిన డెఫిలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు

రెగ్యులర్‌ పోటీల్లో అదరగొడుతున్న బధిర ఆటగాడు

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌) : ధనుష్‌ శ్రీకాంత్‌.. అంతర్జాతీయ షూటింగ్‌లో ఈ పేరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌. 21 ఏళ్ల ఈ బధిర షూటర్‌ గతేడాది జరిగిన డెఫిలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే, పుట్టుకతోనే చెవుడు, మూగ అయిన ఈ కుర్రాడు.. సాధారణ షూటర్లు తలపడే అంతర్జాతీయ ఈవెంట్లలోనూ పతకాలు కొల్లగొడుతూ అసాధ్యుడిగా దూసుకెళుతున్నాడు. 16 ఏళ్ల వయసులో అంటే 2019 ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సాధారణ షూటర్ల ఈవెంట్‌లో పోటీపడి స్వర్ణం సాధించాడు. దీంతో ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి బధిర క్రీడాకారునిగా ధనుష్‌ చరిత్ర సృష్టించాడు. అదే ఏడాది ఆసియా ఆసియా చాంపియన్‌షి్‌పలో జూనియర్‌ వ్యక్తిగత, పురుషుల టీమ్‌, మిక్స్‌డ్‌ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు నెగ్గడంతో అతని ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అప్పటినుంచి కెరీర్‌లో వెనుదిరిగి చూడని ధనుష్‌.. అటు బధిర, ఇటు సాధారణ షూటర్లతో పోటీపడుతూ సంచలన ప్రదర్శనతో దుమ్ము రేపుతున్నాడు. గత నెల జర్మనీలో జరిగిన జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌క్‌పలో పసిడి పతకం కొల్లగొట్టిన ఈ షూటర్‌.. తాజాగా కొరియాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలోనూ మరో స్వర్ణాన్ని నెగ్గి తన గన్‌ పవరేంటో చూపాడు. తనకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ షూటర్‌, ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌, వ్యక్తిగత కోచ్‌ నేహా చవాన్‌ల ప్రోత్సాహంతో ముందుకెళుతున్నాడు.

అదే నా లక్ష్యం..

‘పోటీలకు ముందు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకున్నా. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఒకే ఒక ఆలోచనతో బరిలోకి దిగా. పతకం సాధించా. ఇందుకు నా మెంటార్‌ గగన్‌ నారంగ్‌ సార్‌, కోచ్‌ నేహా చవాన్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎలాంటి సవాల్‌నైనా దీటుగా ఎదుర్కొనేలా వాళ్లు నన్ను సన్నద్ధం చేశారు. వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం’ అని తన అమ్మ సాయంతో ఆంధ్రజ్యోతితో చెప్పాడు.

Updated Date - 2023-07-19T02:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising