ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup Final: కీలక మ్యాచ్‌లో ఫెయిల్ అయిన గిల్, అయ్యర్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-11-19T18:20:27+05:30

టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన టీమిండియా బ్యాట్స్‌మెన్ కీలక ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. బౌలింగ్‌కు అనుకూలించిన స్లో పిచ్‌పై పరుగులు చేయడానికి కష్టపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.

టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచిన టీమిండియా (Team India) బ్యాట్స్‌మెన్ కీలక ఫైనల్ మ్యాచ్‌లో (World Cup Final) మాత్రం తడబడ్డారు. బౌలింగ్‌కు అనుకూలించిన స్లో పిచ్‌పై పరుగులు చేయడానికి కష్టపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న యంగ్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (Shubman Gill ), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇద్దరూ నాలుగేసి పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కీలక మ్యాచ్‌లో చెత్త షాట్లు ఆడి అవుటైన ఈ ఇద్దరిపై సోషల్ మీడియా జనాలు నిప్పులు చెరుగుతున్నారు (India vs Australia).

ఓపెనర్ గిల్ అనవసరంగా పుల్ షాట్ ఆడి అవుటయ్యాడు. స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయబోయి జంపాకు చిక్కాడు. అనంతరం శ్రేయస్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (KL Rahul), కోహ్లీ (Virat Kohli) అర్ధశతకాలు సాధించారు.

Updated Date - 2023-11-19T18:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising