ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Football legend Balaram no more :హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం బలరామ్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-17T01:16:21+05:30

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఒలింపియన్‌ తులసీదాస్‌ బలరామ్‌ (85) గురువారం మరణించాడు. తెలుగునాట పుట్టిన బలరామ్‌.. 1950-60ల్లో భారత పుట్‌బాల్‌ స్వర్ణయుగపు ‘త్రిమూర్తులు’గా పిలుచుకొనే చున్నీ గోస్వామి, పీకే బెనర్జీతోపాటు ఒకడిగా వెలుగొందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఒలింపియన్‌ తులసీదాస్‌ బలరామ్‌ (85) గురువారం మరణించాడు. తెలుగునాట పుట్టిన బలరామ్‌.. 1950-60ల్లో భారత పుట్‌బాల్‌ స్వర్ణయుగపు ‘త్రిమూర్తులు’గా పిలుచుకొనే చున్నీ గోస్వామి, పీకే బెనర్జీతోపాటు ఒకడిగా వెలుగొందాడు. బ్రహ్మచారి అయిన తులసీదాస్‌ దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు. గతేడాది డిసెంబరులో మూత్ర ఇన్ఫెక్షన్‌, ఉదర సంబంధిత సమస్యలో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన కోలుకోలేదని చెప్పారు. 1957లో ఈస్ట్‌బెంగాల్‌ జట్టు తరపున ఆడేందుకు ఒప్పందం చేసుకున్న బలరామ్‌ అప్పటినుంచి బెంగాల్‌లోనే ఉంటున్నాడు.

సికింద్రాబాద్‌లో పుట్టి.. బెంగాల్‌లో మెరిసి

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం

బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి సికింద్రాబాద్‌లోని అమ్ముగూడకు వచ్చిన ముత్తమ్మ, తులసీదాస్‌ కాళిదాస్‌ దంపతులకు బలరామ్‌ జన్మించాడు. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకొన్న తులసీదాస్‌ అతి తక్కువ కాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. గోల్డెన్‌ స్ట్రయికర్‌గా పేరు గడించిన బలరామ్‌ సెంటర్‌ ఫార్వర్డ్‌ లేదా లెఫ్ట్‌ వింగ్‌లో ఎక్కువగా ఆడేవాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్‌తోపాటు హెడర్‌ గోల్స్‌ చేయడంలో దిట్ట అయిన బలరామ్‌.. ఆ సమయంలో ఆసియాలోనే అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో హంగేరి, ఫ్రాన్స్‌, పెరూలు ఉన్న ‘గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌’లో భారత్‌ గట్టిపోటీ ఇచ్చిందంటే అందుకు బలరామ్‌ కారణం. హంగేరి చేతిలో భారత్‌ 1-2తో ఓడినా.. 79వ నిమిషంలో తులసీదాస్‌ గోల్‌ చేశాడు. ఆ తర్వాత పెరూపై కూడా గోల్‌ సాధించాడు. కొన్ని రోజుల తర్వాత జరిగిన మ్యాచ్‌లో బలరామ్‌ గోల్‌తో భారత్‌.. ఫ్రాన్స్‌ను ఓడించినంత పని చేసింది. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో తులసీదాస్‌ సభ్యుడు. 1955-63 మధ్య ఎనిమిదేళ్లపాటు అతడి కెరీర్‌ అమోఘంగా సాగింది. అయితే, 27 ఏళ్ల వయసులో క్షయ బారిన పడడంతో 1963లో రిటైర్మెంట్‌ ప్రకటించడమే కాకుండా.. జరగాల్సిన పెళ్లిని కూడా రద్దు చేసుకొన్నాడు. 1956లో మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో బలరామ్‌ ఆడాడు. దేశం తరఫున 36 మ్యాచ్‌లు ఆడిన తులసీదాస్‌ 10 గోల్స్‌ చేశాడు. కెరీర్‌ మొత్తంలో 131 గోల్స్‌ సాధించాడు. 1956లో హైదరాబాద్‌కు సంతోష్‌ ట్రోఫీని అందించిన బలరామ్‌.. బెంగాల్‌కు మారి ఈస్ట్‌బెంగాల్‌ క్లబ్‌కు ఎక్కువగా ఆడాడు. 1962లో అర్జున అవార్డు అందుకొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత బెంగాల్‌ కోచ్‌గా, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) టాలెంట్‌ హంటర్‌గా సేవలందించాడు.

భారత ఆణిముత్యం: విక్టర్‌ అమల్‌ రాజ్‌

తులసీదాస్‌ బలరామ్‌ భారత ఫుట్‌బాల్‌కు లభించిన ఆణిముత్యమని హైదరాబాద్‌కే చెందిన మరో లెజెండరీ ఆటగాడు విక్టర్‌ అమల్‌రాజ్‌ కొనియాడాడు. అత్యంత విజయవంతంగా సాగిన అతని కెరీర్‌ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నాడు. బలరామ్‌ డ్రిబ్లింగ్‌ను చూసి నాటి తరం సాకర్‌ అభిమానులు ఫిదా అయిపోయేవారని అన్నాడు.

బలరామ్‌ కెరీర్‌ విజయాలు

  • 1962-ఆసియా క్రీడల్లో స్వర్ణం

  • 1959-మెర్దెకా టోర్నీ రన్నరప్‌

  • 1958-ఈస్ట్‌ బెంగాల్‌ తరపున ఐఎ్‌ఫఏ షీల్డ్‌

  • 1956-57-హైదరాబాద్‌ తరపున సంతోష్‌ ట్రోఫీ

  • 1958-59, 59-60, 62-63:

  • బెంగాల్‌ తరపున సంతోష్‌ ట్రోఫీ

  • 1962-అర్జున అవార్డు

Updated Date - 2023-02-17T01:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising