ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gambhir: మీరెన్ని సార్లు అడిగినా నా సమాధానం అదే.. కోహ్లీతో గొడవపై గంభీర్ స్పందన!

ABN, Publish Date - Dec 23 , 2023 | 03:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 అనగానే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య జరిగిన గొడవే చాలా మందికి గుర్తుకొస్తుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023) అనగానే విరాట్ కోహ్లీ (Virat Kohli), గౌతమ్ గంభీర్‌ల (Gautam Gambhir) మధ్య జరిగిన గొడవే చాలా మందికి గుర్తుకొస్తుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ (LSG vs RCB) అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. లఖ్‌నవూ మెంటార్ అయిన గంభీర్ తమ జట్టు బౌలర్ అయిన నవీన్-ఉల్-హక్‌కు మద్దతుగా నిలుస్తూ విరాట్‌తో మాటల దాడికి దిగాడు. ఆ ఘటన అనంతరం కూడా గంభీర్, నవీన్ సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.

ఆ వివాదం గురించి గంభీర్ ఆ తర్వాత చాలా సార్లు స్పందించాడు. ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌కు (South Africa vs India) కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గంభీర్‌కు ఓ కార్యక్రమంలో మరోసారి అదే ప్రశ్న ఎదురైంది. దీంతో గంభీర్ కాస్త అసహనానికి ఎదురయ్యాడు. ``ఇటీవల విరాట్ కోహ్లీ తన 50వ సెంచరీని ఎవరి బౌలింగ్‌లో చేశాడు`` అని గంభీర్‌ను వ్యాఖ్యాత ప్రశ్నించారు. దానికి గంభీర్ స్పందిస్తూ.. ``వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కోహ్లీ 50 సెంచరీ మార్క్ అందుకున్నాడ``ని గంభీర్ చెప్పాడు.

అనంతరం ఆ వ్యాఖ్యాత ఐపీఎల్ నాటి ఘటనను మరోసారి ప్రస్తావించారు. దానికి గంభీర్ సమాధానమిస్తూ.. ``మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే.. ఎవరితోనైనా నా గొడవ కేవలం మైదానం వరకే పరిమితం`` అని గంభీర్ స్పష్టం చేశాడు. ఇక, దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ సాధించిన సంజూ శాంసన్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. సంజూ అద్భుతమైన ట్యాలెంట్ కలిగిన ఆటగాడని, ఇకపై నిలకడ చూపించాల్సిన అవసరం ఉందని అన్నాడు.

Updated Date - Dec 23 , 2023 | 03:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising