ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DCvsSRH: హ్యారీ బ్రూక్ సూపర్ ఫీల్డింగ్.. ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్ నుంచి కూడా అభినందన!

ABN, First Publish Date - 2023-04-30T08:19:11+05:30

ప్రస్తుత ఐపీఎల్‌లో చాలా మంది ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు. అలాగే బౌండరీ లైన్ వద్ద అద్భుత విన్యాసాలతో భారీ షాట్‌లను అడ్డుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) చాలా మంది ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు. అలాగే బౌండరీ లైన్ వద్ద అద్భుత విన్యాసాలతో భారీ షాట్‌లను అడ్డుకుంటున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook) మంచి ఫీల్డింగ్‌తో ఐదు పరుగులు కాపాడాడు. బ్రూక్ ఎఫర్ట్ ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్‌ను కూడా మెప్పించింది. అతడు కూడా బ్రూక్‌ను చప్పట్లతో అభినందించాడు.

శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ (SRHvsDC) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్లో మిచెల్ మార్ష్ (Mitchell Marsh) బ్యాటింగ్ చేస్తున్నాడు. మార్ఖండే వేసిన బంతికి మార్ష్ భారీ షాట్ కొట్టాడు. అది సిక్స్ అని అందరూ అనుకున్నారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రూక్ అమాంతం గాల్లోకి ఎగిరి ఆ బంతిని అడ్డుకున్నాడు. కింద పడుతుండగా ఆ బంతిని బౌండరీ లోపలికి విసిరేశాడు. దీంతో ఢిల్లీకి ఆరు పరుగులు రావాల్సింది కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది (Harry Brook Saves A Six).

Virat Kohli: ఇంజనీరింగ్ పరీక్షా పత్రంలో కోహ్లీ గురించి ప్రశ్న.. నెటిజన్ల స్పందన ఏంటంటే..

బ్రూక్ ఫీల్డింగ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఆ షాట్ కొట్టిన మిచెల్ మార్ష్ కూడా అభినందించాడు. చప్పట్లు కొట్టాడు. ప్రేక్షకులు కూడా బ్రూక్‌ను అభినందించారు. ``ఈ ఫీల్డింగ్‌కు రూ.13 కోట్లు ఇవ్వొచ్చు`` అని ఒకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో అదరగొట్టిన బ్రూక్‌ను హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌ తప్ప మిగిలిన అన్నింటిలోనూ బ్రూక్ విఫలమయ్యాడు.

Updated Date - 2023-04-30T08:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising