ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hockey Junior World Cup : హందల్‌ హ్యాట్రిక్‌

ABN, First Publish Date - 2023-12-06T02:46:03+05:30

అర్జీత్‌సింగ్‌ హందల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో.. పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. మంగళవారం పూల్‌-సిలో జరిగిన తమ

భారత్‌ సూపర్‌ బోణీ

కొరియాపై 4-2తో గెలుపు

హాకీ జూనియర్‌ వరల్డ్‌కప్‌

కౌలాలంపూర్‌: అర్జీత్‌సింగ్‌ హందల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో.. పురుషుల జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. మంగళవారం పూల్‌-సిలో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 4-2తో కొరియాను ఓడించింది. అర్జీత్‌ (11వ, 16వ, 41వ నిమిషం) మూడు గోల్స్‌ చేయగా.. అమన్‌దీప్‌ (30వ) ఓ గోల్‌ సాధించాడు. కొరియా తరఫున లిమ్‌ దొహయున్‌ (38వ), కిమ్‌ మింగ్‌వోన్‌ (45వ) చెరో గోల్‌ చేశారు. ఆట ఆరంభం నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అర్జీత్‌ గోల్‌గా మలిచాడు. ఇక, రెండో క్వార్టర్‌లో అర్జీత్‌, అమన్‌దీప్‌ చెరో ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ 3-0తో మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో కొరియా ప్లేయర్‌ లిమ్‌ గోల్‌ చేయగా.. అర్జీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్‌ నమోదు చేశాడు. ఆ తర్వాత భారత డిఫెన్స్‌ ఉదాసీనంగా వ్యవహరించడంతో కిమ్‌ మింగ్‌వోన్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి ఆధిక్యాన్ని 4-2కు తగ్గించాడు. ఆఖరి క్వార్టర్‌లో ఇరుజట్లూ గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ తలపడనుంది. 2001, 2016ల్లో భారత్‌ రెండుసార్లు టోర్నీ గెలవగా.. 1997లో రన్నరప్‌గా నిలిచింది. పూల్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో ఆస్ట్రేలియాకు షాకివ్వగా.. పూల్‌-సిలో స్పెయిన్‌ 7-0తో కెనడాను చిత్తు చేసింది. పూల్‌-బిలో జరిగిన మ్యాచ్‌ల్లో జర్మనీ 5-3తో దక్షిణాఫ్రికాపై, ఫ్రాన్స్‌ 3-1తో ఈజిప్ట్‌పై గెలిచాయి.

పెనాల్టీ షూటౌట్‌లో అమ్మాయిల గెలుపు

శాంటియాగో (చిలీ): జూనియర్‌ మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించిన భారత జట్టు వర్గీకరణ మ్యాచ్‌లో మాత్రం గెలిచింది. మంగళవారం ఇక్కడ 9-16 స్థానాల కోసం జరిగిన పోరులో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 3-3తో స్కోరు సమం చేయడంతో.. అనివార్యమైన పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ ఓ గోల్‌ అధికంగా చేసి విజయాన్ని అందుకుంది.

Updated Date - 2023-12-06T02:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising