కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jersey number 7 : మహీ గౌరవార్ధం.. నెంబర్‌ 7 జెర్సీకి వీడ్కోలు

ABN, Publish Date - Dec 16 , 2023 | 03:57 AM

టీమిండియాకు రెండు ప్రపంచక్‌పలను అందించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రపుటల్లో నిలిచిన ధోనీ మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి

Jersey number 7 : మహీ గౌరవార్ధం.. నెంబర్‌ 7 జెర్సీకి వీడ్కోలు

న్యూఢిల్లీ: టీమిండియాకు రెండు ప్రపంచక్‌పలను అందించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రపుటల్లో నిలిచిన ధోనీ మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగగా.. ఇప్పుడతని జెర్సీ నెంబర్‌ 7 కూడా రిటైర్‌ కానుంది. ధోనీ గౌరవార్ధం ఇకనుంచి ఈ జెర్సీని ఎవరికీ కేటాయించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 7వ నెంబర్‌ జెర్సీ కావాలని ఎవరూ కోరవద్దని ఆటగాళ్లకు బోర్డు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ‘క్రికెట్‌కు ధోనీ అందించిన సేవలకు గాను ఏడో నెంబర్‌ జెర్సీకి వీడ్కోలు పలకాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త ప్లేయర్లు 7,10 కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెంబర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 60 నెంబర్లను ఆటగాళ్ల కోసం కేటాయించాం’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. సచిన్‌ ధరించిన 10వ నెంబర్‌ జెర్సీని కూడా ఎవరికీ కేటాయించని విషయం తెలిసిందే. అయితే ఓపెనర్‌ గిల్‌ భారత జట్టుకు ఆడినప్పుడు 77 నెంబర్‌ ధరిస్తుండగా.. ఐపీఎల్‌లో మాత్రం ఏడో నెంబర్‌తోనే బరిలోకి దిగుతున్నాడు.

Updated Date - Dec 16 , 2023 | 03:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising