నేటి నుంచి ఖమ్మంలో ఆలిండియా మహిళా టీ-20 క్రికెట్
ABN, First Publish Date - 2023-01-05T00:04:26+05:30
ఆలిండియా టీ-20 క్రికెట్ ఫెడరేషన్, యువం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్ మహిళా టీ-20 పోటీలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టోర్నీ వివరాలను కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు.
ఖమ్మం స్పోర్ట్స్: ఆలిండియా టీ-20 క్రికెట్ ఫెడరేషన్, యువం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రీమియర్ లీగ్ మహిళా టీ-20 పోటీలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టోర్నీ వివరాలను కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. అలాగే తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ జట్లతో పాటు రెండు స్థానిక జట్లు పోటీపడతాయని తెలిపారు.
Updated Date - 2023-01-05T00:04:44+05:30 IST