ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Womens cricket: బంగ్లాదేశ్ అంపైరింగ్ దారుణంగా వుంది: భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్

ABN, First Publish Date - 2023-07-22T18:15:53+05:30

భారత విమెన్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ విమెన్ జట్టు మీద మూడో వన్ డే మ్యాచ్ లో టై చేసింది. అయితే ఈ మ్యాచ్ బాంగ్లాదేశ్ టై చేసింది కేవలం దయనీయమైన అంపైరింగ్ వల్ల అని భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ విమర్శించింది. ఇంకోసారి బాంగ్లాదేశ్ కి పర్యటించడానికి వచ్చినప్పుడు క్రికెట్ తో పాటు ఇక్కడ అంపైరింగ్ కూడా దారుణంగా ఉంటుంది అని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పింది.

Indian Women cricket team captain Harman Preet Kaur and vice captain Smriti Mandhana

ఈరోజు భారత, బాంగ్లాదేశ్ విమెన్ జట్ల మధ్య మూడో అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ జరిగింది. (Bangladesh Women vs Indian Women) ఈ మ్యాచ్ 'టై' (Tied) అవటం విశేషం. మొదటి బాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ విమెన్ (BangladeshWomen) జట్టు 50 ఓవర్లలో 225 పరుగులు చేసింది. బాంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్ విమెన్ ఫర్గాన హాక్ (FarganaHoque) సెంచరీ చెయ్యడం విశేషం. ఆమె 160 బాల్స్ ఆడి 107 పరుగులు చేసింది. ఇంకో ఓపెనర్ షమిమా సుల్తానా (ShamimaSultana) అర్థ సెంచరీ సాధించింది. బాంగ్లాదేశ్ మొత్తం 225 పరుగులు చేసి నాలుగు వికెట్స్ కోల్పోయింది. ఇండియా బౌలర్లులో స్నేహ రానా (SnehaRana) రెండు వికెట్స్ తీసుకుంది.

విజయ్ లక్ష్యం 226 పరుగులతో బాటింగ్ కి దిగిన భారత విమెన్ టీము ఓపెనింగ్ జంటగా ఈసారి స్మ్రితి మంధన (SmritiMandhana), షెఫాలీ వర్మ (ShefaliVarma) వచ్చారు. అయితే షెఫాలీ వర్మ తొందరగానే కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టింది. తరువాత వచ్చిన యాస్తికా భాటియా (YastikaBhatia) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయింది. ఆమె 5 పరుగులు చేసి అవుట్ అయింది. ఆ తరువాత వచ్చిన హర్లీన్ డియోల్ (HarleenDeol), స్మ్రితి మంధన ఇద్దరూ మెల్లగా ఆడుతూ భారత జట్టు ఆశలు చిగురింపచేశారు. ఇద్దరూ కలిపి 107 పరుగులు జోడించారు. స్మ్రితి మంధన అర్థ సెంచరీ సాధించి 59 పరుగుల వద్ద అవుట్ అయిపొయింది.

జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (HarmanPreetKaur) కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయింది, ఆమె కేవలం 14 పరుగులు మాత్రమే చేసింది. తరువాత వచ్చిన అల్ రౌండర్ దీప్తి శర్మ (DeeptiSharma) కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రన్నవుట్ (Runout) అయింది. అంతవరకు బాగా ఆడుతున్న హర్లీన్ కూడా 77 ముఖ్యమైన పరుగులు చేసి రన్ అవుట్ అయింది. ఒక్కసారి భారత విమెన్ జట్టు కుప్పకూలడంతో అప్పుడే బాటింగ్ కి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (JemimahRodrigues) మీదే భారం పడింది. దీప్తి శర్మ అవుట్ అయ్యేసరికి భారత జట్టు 192 పరుగులకు 6 వికెట్స్ కోల్పోయింది. జెమిమా మాత్రమే బాటింగ్ చెయ్యగలదు, మిగతా అందరూ టైలెండర్లు, 8 ఓవర్లు మిగిలి వున్నాయి, 34 పరుగులు చెయ్యాలి. కానీ 33 పరుగులు మాత్రమే చేసి 225 పరుగులు వద్ద అందరూ అలవుట్ అయిపోయారు. మ్యాచ్ టై అయిపొయింది. జెమిమా 33 పరుగులు సాధించి నాటవుట్ గా మిగిలిపోయింది. మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ చెరొకటి గెలిచి, మూడోది ఇలా 'టై' అయిపొయింది. ట్రోఫీ ని రెండు జట్లు షేర్ చేసుకున్నాయి.

మ్యాచ్ తరువాత భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ బాంగ్లాదేశ్ అంపైరింగ్ (Bangladesh umpiring is pathetic) చాలా దారుణంగా ఉందని విమర్శించింది. ఇలా మ్యాచ్ అయిన తరువాత ఒక జట్టు కెప్టెన్ అంపైరింగ్ గురించి మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారేమో. "ఈ మ్యాచ్ తో మేము చాలా నేర్చుకున్నాం, క్రికెట్ కాకుండా ఇంత దారుణమైన అంపైరింగ్ ఉంటుందని కూడా తెలుసుకొని షాకయ్యాము," అని చెప్పింది హర్మాన్ ప్రీత్ కౌర్. ముందు ముందు బాంగ్లాదేశ్ లో పర్యటించడానికి మా జట్టు వచ్చినప్పుడు మేము అంతా ఇలాంటి చెత్త అంపైరింగ్ ఉంటుందని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని భారత జట్టు కెప్టెన్ బాంగ్లాదేశ్ అంపైరింగ్ ఎంత దారుణంగా ఉందొ వివరించింది.

బాంగ్లాదేశ్ జట్టు బాగానే బాటింగ్ చేసింది, అలాగే మేము కూడా ఈ మ్యాచ్ లో కంట్రోల్ లో వున్నాం కానీ నేను ముందు చెప్పినట్టుగా బాంగ్లాదేశ్ అంపైరింగ్ చాలా దయనీయంగా ఉండటం, వాళ్ళు ఇచ్చిన కొన్ని డెసిషన్స్ మాకు చాలా అసంతృప్తిగా వుంది అని బాంగ్లాదేశ్ అంపైరింగ్ మీద విరుచుకు పడింది భారత జట్టు కెప్టెన్.

Updated Date - 2023-07-22T19:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising