ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త.. కొత్తగా!

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:48 AM

జొహాన్నె్‌సబెర్గ్‌: వరల్డ్‌కప్‌ కల చెదిరిన భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు వన్డే ఫార్మాట్‌ను సరికొత్తగా ఆరంభించనున్నాయి.

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి వన్డే నేడు

రింకూ సింగ్‌ అరంగేట్రం?

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

రాహుల్‌ కెప్టెన్సీపైనే కళ్లన్నీ

జొహాన్నె్‌సబెర్గ్‌: వరల్డ్‌కప్‌ కల చెదిరిన భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు వన్డే ఫార్మాట్‌ను సరికొత్తగా ఆరంభించనున్నాయి. అదిరే ప్రదర్శనతో టీ20 సిరీ్‌సను సమం చేసిన టీమిండియా.. సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డే సిరీ్‌సలోనూ సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. వరల్డ్‌క్‌పతో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ శకం ముగిసినట్టే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ భారత జట్టును నిర్మించడం.. ఆదివారం జరిగే తొలి వన్డేతో ఆరంభం కానుంది. ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీ్‌సకు పెద్దగా ఆకర్షణ లేకపోయినా.. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ లక్ష్యాంగానే ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు గమనించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై అందరి దృష్టీ నెలకొననుంది. ఈ సిరీ్‌సలో హిట్‌మ్యాన్‌ వారసుడిగా అతడు నమ్మకాన్ని చూరగొంటే.. వన్డే కెప్టెన్‌గా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. రాహుల్‌తోపాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌పై జట్టు బ్యాటింగ్‌ ఆధారపడింది. తమదైన ముద్ర వేయడానికి సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మలకు చక్కని అవకాశం. పొట్టి ఫార్మాట్‌లో చెలరేగి పోతున్న రింకూ సింగ్‌ వన్డేల్లో అరంగేట్రం చేసే చాన్సులున్నాయి. అయితే, ముఖేష్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌లతో కూడిన పేస్‌ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా పరిస్థితి కూడా టీమిండియా తరహాలోనే ఉంది. డికాక్‌ రిటైరకావడం లోటే అయినా.. హెండ్రిక్స్‌, డుస్సెన్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌తో జట్టు భారాన్ని మోస్తున్నారు. అయితే, రబాడ, నోకియా అందుబాటులో లేకపోవడం టీమిండియా కుర్రాళ్లకు ఊరటనిచ్చే అంశం. కాగా, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం స్టేడియం మొత్తం గులాబీ రంగును సంతరించుకోనుంది.

సఫారీలతో టెస్టులకు షమి దూరం

వన్డే సిరీస్‌ నుంచి చాహర్‌ అవుట్‌

సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సకు పేసర్‌ షమి దూరమయ్యాడు. కాలి గాయంతో ఇబ్బందులు పడుతున్న అతడికి డాక్టర్లు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. కాగా, మరో పేసర్‌ దీపక్‌ చాహర్‌ వన్డే సిరీస్‌ నుంచి అవుటయ్యాడు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అతడు దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి తప్పుకొన్నాడు. చాహర్‌ స్థానంలో బెంగాల్‌ పేసర్‌ ఆకాష్‌ దీప్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. తొలి వన్డే తర్వాత అయ్యర్‌ టెస్ట్‌ టీమ్‌లో చేరతాడని పేర్కొంది. రెండు, మూడు వన్డేలకు అతడు అందుబాటులో ఉండడని చెప్పింది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఇతర సహాయ సిబ్బంది టెస్టు జట్టు బాధ్యతలను మాత్రమే చూసుకొంటారని తెలిపింది. వన్డే సిరీస్‌ పర్యవేక్షణను భారత్‌-ఎ కోచ్‌ సితాన్షు కొటక్‌కు అప్పగించినట్టు చెప్పింది.

జట్లు (అంచనా)

భారత్‌: రుతురాజ్‌, సుదర్శన్‌, తిలక్‌, అయ్యర్‌, రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రింకూ/సంజూ, అక్షర్‌, అర్ష్‌దీప్‌, అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌, ముకేష్‌.

సౌతాఫ్రికా: హెండ్రిక్స్‌, టోనీ, డుస్సెన్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), క్లాసెన్‌, మిల్లర్‌, పెహ్లుక్వాయో, ముల్డర్‌, బర్గర్‌, కేశవ్‌/షంసీ, విలియమ్స్‌.

పిచ్‌/వాతావరణం

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉండనుంది.

Updated Date - Dec 17 , 2023 | 05:48 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising