Neeraj Chopra: నేనే నెంబర్ 1
ABN, First Publish Date - 2023-05-23T04:32:35+05:30
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. ఈ టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచ నెం.1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
వరల్డ్ టీటీ
● నీరజ్ చోప్రా మరో చరిత్ర
● కెరీర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్
● ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. ఈ టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచ నెం.1 ర్యాంక్ దక్కించుకున్నాడు. ఈమేరకు వరల్డ్ అథ్లెటిక్స్ సోమవారం నాడు ర్యాంకులను ప్రకటించింది. గ్రెనడాకు చెందిన ప్రపంచ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ (1433పాయింట్లు)ను నీరజ్ (1455 పాయింట్లు) వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ (చెక్ రిపకబ్లిక్, 1416) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఆగస్టు 30న రెండో ర్యాంక్ దక్కించుకున్న చోప్రా తన అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో తొలిసారి ప్రపంచ అగ్రస్థానానికి ఎగబాకాడు. కాగా.. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్న తొలి ఆటగాడిగా 25 ఏళ్ల నీరజ్ రికార్డు నెలకొల్పాడు. ఇక..ఈ సీజన్ డైమండ్ లీగ్‌లో భాగంగా ఈనెల 6న దోహాలో జరిగిన తొలి అంచెలో నీరజ్ పసిడి పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-05-23T04:32:39+05:30 IST