ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KKR vs SRH: సన్‌రైజర్స్ జోరు కొనసాగేనా? కోల్‌కతాకు బ్రేకులు వేసేనా? ఈ రోజు మ్యాచ్‌లో గెలుపెవరిది?

ABN, First Publish Date - 2023-04-14T12:30:01+05:30

ఈ ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్ జట్టు మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ ఐపీఎల్‌ను (IPL 2023) పేలవంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ (SRH) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్ జట్టు మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మరోవైపు ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా (KKR) తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. విజయానికి 29 పరుగులు కావాల్సిన దశలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh) 5 బంతులకు 5 సిక్స్‌లు కొట్టాడు.

ఈ రోజు (శుక్రవారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచ్‌లో హైదరాబాద్, కోల్‌కతా జట్లు తలపడబోతున్నాయి (SRHvsKKR). నితీష్ రాణా (Nitish Rana) నేతృత్వంలోని కేకేఆర్ టీమ్ స్వంత మైదానంలో జరగబోయే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తీరాలని కృత నిశ్చయంతో ఉంది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. నిజానికి కోల్‌కతా టీమ్‌లో పెద్ద స్టార్ ప్లేయర్స్ లేరు. అయినా రహ్మానుల్లా, వెంకటేషన్ అయ్యర్, నితీష్ రాణా, నారాయణ్ జగదీశన్, రింకూ సింగ్ వంటి దేశవాళీ ఆటగాళ్లే సమర్థవంతంగా ఆడి జట్టును గెలిపిస్తున్నారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, శార్దూల్ ఠాకూర్ చక్కగా రాణిస్తున్నారు.

Mohit Sharma: మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. మోహిత్ శర్మ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులంటే..

మరోవైపు హైదరాబాద్ ఆదెన్ మార్‌క్రమ్ (Aiden Markram), హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే వీరు సమష్టిగా ఆడి విజయం సాధించడంలో విఫలమవుతున్నారు. గత మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ టీమ్ అంతా కలిసికట్టుగా ఆడితే విజయం సాధ్యమవుతుంది. అయితే స్వంత మైదానంలో ఆడుతుండడం కోల్‌కతాకు కలిసి రానుంది. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించే ఈడెన్ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి, ఈ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ గెలవాలని కోరుకుందాం.

తుది జట్లు: (అంచనా)

హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

కోల్‌కతా: రహ్మనుల్లా, నారాయణ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Updated Date - 2023-04-14T12:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising