ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KS BHARATH: ధోనీ సలహాలు పని చేశాయి

ABN, First Publish Date - 2023-06-29T05:02:56+05:30

రంజీ ట్రోఫీలో ట్రిపుల్‌ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా సిరీ్‌సతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ప్రతిభతో ఆకట్టుకొని వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఆడాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విండీస్‌ టూర్‌లో సత్తా చాటుతా ఞ అన్ని ఫార్మాట్లలోనూ ఆడతా

‘ఆంధ్రజ్యోతి’తో కేఎస్‌ భరత

డబ్ల్యూటీసీ ఫైనల్‌ చాలా నేర్పింది

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): రంజీ ట్రోఫీలో ట్రిపుల్‌ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా సిరీ్‌సతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ప్రతిభతో ఆకట్టుకొని వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఆడాడు. అక్కడా తానేంటో నిరూపించుకొని త్వరలో జరిగే వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇలా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు కోన శ్రీకర్‌ భరత. అయితే, తాను టెస్టులకే పరిమితం కాననీ, చాన్సిస్తే వన్డేలు, టీ20ల్లోనూ సత్తా చాటుతానంటున్న ఈ తెలుగు క్రికెటర్‌ ఆంధ్రజ్యోతితో పంచుకున్న విశేషాలు అతని మాటల్లోనే..

దేశానికి ప్రాతినిథ్యం వహించడం అత్యంత గౌరవం...

టీమిండియాలో చోటు కోసం ఎంతో శ్రమించా. అనుకున్నది సాధించా. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీ్‌సతో జాతీయ జట్టుకు ఆడాను. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది? నా తొలి మ్యాచ్‌ ఆడినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా కల నెరవేరింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడడంపై..

డబ్ల్యూటీసీ ఫైనల్‌ నాకు చాలా అనుభవాన్నిచ్చింది. ఈ ఫైనల్‌ ద్వారా సీనియర్లు, ప్రతిభావంతులైన క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా ఇలాంటి మెగా ఈవెంట్లు ఆడేటప్పుడు మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలన్న విషయాలపై పూర్తి అవగాహన వచ్చింది. రంజీల్లో ఆడిన అనుభవం నాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది.

ధోనీ భాయ్‌ సలహాలతో...

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ధోనీ భాయ్‌తో మాట్లాడా. ఇంగ్లండ్‌ పిచ్‌లపై అతనిఅనుభవాలను అడిగి తెలుసుకున్నా. కీపర్‌ ఏ పొజిషన్‌లో ఉండాలి, బంతి ఎలా వస్తుంది, బ్యాటర్‌ను ఎలా జడ్జ్‌ చేయాలి వంటి ఎన్నో విషయాలతో పాటు.. మ్యాచ్‌లో కీలక సమయాల్లో కీపర్‌ పోషించాల్సిన పాత్రపై సమగ్రంగా ధోనీ భాయ్‌ వివరించాడు. అతని సలహాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి.

విండీస్‌ పర్యటనలో సత్తా చాటుతా...

వచ్చేనెలలో జరిగే వెస్టిండీస్‌ పర్యటనలోనూ చోటు దక్కడం ఆనందంగా ఉంది. జూనియర్‌ స్థాయిలో అక్కడి పిచలపై ఆడాను. అయితే, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. విండీస్‌ పిచ్‌లకు అనుగుణంగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) అకాడమీలో వికెట్‌ తయారు చేయించుకుని సాధన చేస్తున్నా. పిచ్‌ కండీషన్‌కు తగ్గట్టుగా ఆడేలా టెక్నిక్‌పై దృష్టి సారించా. తప్పకుండా ఆ టూర్‌లో నేనేంటో నిరూపించుకుంటానన్న విశ్వాసముంది.

ఆటుపోట్లు సహజం...

క్రికెటర్‌ ప్రయాణంలో ఆటుపోట్లు సహజం. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున రాణించాను. అయితే, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాను. అందుకు నేనేమీ బాధపడడం లేదు. కాంబినేషన్‌కు అనుగుణంగా తుది జట్టులో చోటు దక్కుతుంది. స్థానం లభించలేదని నిరుత్సాహపడకుండా.. ఫిట్‌నెస్‌, టెక్నిక్‌పై దృష్టి సారించడంపై ఆ సమయాన్ని వెచ్చించాను. ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ప్రాధాన్యతనిచ్చాను. ఐపీఎల్‌లో రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితమైనా, సెలెక్టర్లు నాపై నమ్మకముంచి డబ్ల్యూటీసీకి ఎంపిక చేశారు.

నాకు నేనే పోటీ..

టీమిండియాలో కీపర్‌గా నేనెవరికీ పోటీ కాదు.. నాకు నేనే పోటీ. సంజూ, సాహా, పంత్‌, ఇషాన్‌లను నా సహచరులుగానే భావిస్తాను తప్ప, పోటీగా అనుకోవడం లేదు. ఎవరు బాగా ఆడితే వారికే చోటు దక్కుతుంది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉండడం మంచిదే. ఇలా ఉంటే.. జట్టులో చోటు కోసం ఎప్పటికప్పుడు ఆటతీరుతోపాటు ఫిట్‌నె్‌సను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తుంటాం.

అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తా..

ఇప్పటిదాకా టీమిండియాకు టెస్టులు మాత్రమే ఆడాను. భవిష్యతలో అన్ని ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకోవాలనుకుంటున్నా. చాన్సిస్తే పరిమిత ఓవర్లలోనూ నేనేంటో నిరూపించుకుంటా. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండాలన్నది నా లక్ష్యం.

ఆమె.. నా అదృష్టం...

అందరి సహకారంతో ఈ స్థాయికి చేరాను. చిన్నప్పుడు తల్లిదండ్రులతోపాటు అక్క నన్ను ముందుకు నడిపించింది. ఇక్కడి కోచ్‌లు, వీడీసీఏ, ఏసీఏ ప్రతినిధులతోపాటు చాలామంది స్నేహితులు నన్ను ప్రోత్సహించారు. నా భార్య పూర్తి సహకారాన్నిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. పెళ్లయిన తర్వాత అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ఆటలో బిజీ అయ్యాను. ఆమె నా అదృష్ట దేవత.

Updated Date - 2023-06-29T05:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising