LSGvsPBKS: బాబోయ్.. ఇదేం బాదుడు.. మొహలీ పిచ్‌పై నెటిజన్ల కామెంట్లు చూస్తే..
ABN, First Publish Date - 2023-04-29T09:40:53+05:30
మొహలీ పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ పూనకం వచ్చినట్టు ఒకటే బాదుడు బాదారు.
మొహలీ (Mohali) పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) బ్యాటర్లు చెలరేగిపోయారు. పంజాబ్ (PBKS) బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ పూనకం వచ్చినట్టు ఒకటే బాదుడు బాదారు. వారి బ్యాటింగ్ చేస్తే సిక్స్‌లు కొట్టడం ఇంత సులభమా అనిపించకమానదు. మొహలీలో పరుగుల సునామీ సృష్టించి ఈ సీజన్‌లో (IPL 2023) ఇప్పటివరకు అత్యధిక స్కోరును నమోదు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆ తర్వాత తన నిర్ణయం ఎంత తప్పో తెలుసుకున్నాడు. లఖ్‌నవూ బ్యాటర్లు బ్యాట్‌తో శివాలెత్తుతుంటే చూస్తుండిపోవడం తప్ప పంజాబ్ బౌలర్లు ఏమీ చేయలేకపోయారు. తొలుత కైల్ మేయర్స్ (Kyle Mayers), ఆ తర్వాత ఆయుష్ బదోనీ (Ayush Badoni), అనంతరం మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) విజృంభించారు. మేయర్స్ (24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), బదోనీ (24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72), నికోలస్ పూరన్ (19 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 45) చెలరేగడంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.
MS Dhoni Mobile: ధోనీ మొబైల్ ఉపయోగించడా? ఈ వీడియో చూస్తే నమ్మక తప్పదు..
అనంతరం ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లు ఆడి 201 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 450 పరుగులు చేశాయి. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా నిలిచిన పిచ్‌పై నెటిజన్లు ఫన్నీ మీమ్‌లు సృష్టించి వైరల్ చేస్తున్నారు. ``మొహలీ పిచ్ క్రికెట్ పిచ్‌లా లేదు.. హైవేలా ఉంది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-04-29T09:40:53+05:30 IST