ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: హైదరాబాద్ సూపర్ ఫీల్డింగ్.. ఢిల్లీపై విజయానికి కారణం అదే..

ABN, First Publish Date - 2023-04-30T09:22:36+05:30

క్రికెట్‌లో ``క్యాచెస్ విన్స్ మ్యాచెస్`` అనే నానుడి బాగా పాపులర్. క్యాచ్‌లే (Catches) మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ (SRH)ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెట్‌లో ``క్యాచెస్ విన్స్ మ్యాచెస్`` అనే నానుడి బాగా పాపులర్. క్యాచ్‌లే (Catches) మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DC) జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ (SRH)ఆటగాళ్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. హైదరాబాద్ గెలుపులో ఫీల్డింగ్‌ది కూడా కీలక పాత్రే. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద హ్యారీ బ్రూక్ (Harry Brook) అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ బంతికి ఆరు పరుగులు రావాల్సింది ఒక్క పరుగే వచ్చింది.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ (67), క్లాసెన్ (53 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే వార్నర్ (David Warner) (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సాల్ట్ (Phil Salt) (59) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అలాంటి ప్రమాదకర సాల్ట్‌ను హైదరాబాద్ బౌలర్ మార్ఖండే (Mayank Markande) అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

DCvsSRH: హ్యారీ బ్రూక్ సూపర్ ఫీల్డింగ్.. ప్రత్యర్థి టీమ్ బ్యాట్స్‌మెన్ నుంచి కూడా అభినందన!

తన మూడో ఓవర్ వేసేందుకు వచ్చిన మార్ఖండే రెండో బంతికి అద్భుతం చేశాడు. మార్ఖండే వేసిన బంతిని సాల్ట్ స్ట్రైట్‌గా ఆడాడు. సాల్ట్ చాలా బలంగా కొట్టిన ఆ బంతిని మార్ఖండే అద్భుతంగా పట్టుకున్నాడు. సెకెన్ల వ్యవధిలో స్పందించి లో క్యాచ్‌ను పట్టుకున్నాడు. సాల్ట్ అవుట్ కావడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. చివరకు 20 ఓవర్లలో 188 పరుగులు చేసి 9 రన్స్ తేడాతో ఓడిపోయింది.

Updated Date - 2023-04-30T09:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising