Mohammad Kaif: ఆరోజు కోహ్లీ ప్రవర్తన షాక్ కలిగించింది.. విరాట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మహ్మద్ కైఫ్!
ABN, First Publish Date - 2023-04-08T12:06:46+05:30
గతేడాది ఐపీఎల్‌లో పేలవ ఫామ్‌తో సతమతమైన విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ తర్వాత ఒక నెల పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఘనంగా పునరాగమనం చేశాడు. ఆ తర్వాత నాలుగు సెంచరీలు చేసి ఫామ్‌లోకి వచ్చాడు.
గతేడాది ఐపీఎల్‌లో పేలవ ఫామ్‌తో సతమతమైన విరాట్ కోహ్లీ (Virat Kohli) తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ టోర్నీ తర్వాత ఒక నెల పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఘనంగా పునరాగమనం చేశాడు. ఆ తర్వాత నాలుగు సెంచరీలు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక, ఈ ఐపీఎల్‌ను (IPL 2023) ఘనంగా ప్రారంభించాడు. ముంబైతో (MI) ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి టీమ్‌ను గెలిపించాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif).. కోహ్లీ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఆర్సీబీ తరఫున గతంలో కోహ్లీ, కైఫ్ కలిసి ఆడారు. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న కైఫ్ పాత జ్ఞాపకాన్ని అందరితో పంచుకున్నాడు. ``ఆ రోజు మ్యాచ్‌లో కోహ్లీ చాలా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి బ్యాట్‌ను కోపంగా విసిరేశాడు. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ``తర్వాతి మ్యాచ్‌లో పెద్ద స్కోరు చేస్తాను`` అని చెప్పాడు. అన్నట్టుగానే తర్వాతి మ్యాచ్‌లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడ``ని కైఫ్ చెప్పాడు.
IPL 2023: సచిన్ వారసుడు అరంగేట్రం చేయనున్నాడా? సారా టెండూల్కర్ ఏమని పోస్ట్ చేసిందంటే..
ఆ రోజు మ్యాచ్‌లో ఔట్ కావడం గురించి కోహ్లీ కొద్ది సేపటికే మర్చిపోయి తర్వాతి మ్యాచ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడని, అప్పుడే కోహ్లీ తనకు చాలా ప్రత్యేకంగా కనిపించాడని, ఆ రోజు అతడి ప్రవర్తన షాక్ కలిగించిందని కైఫ్ చెప్పాడు. తను అనుకున్నట్టుగానే కోహ్లీ ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడని కైఫ్ పేర్కొన్నాడు.
Updated Date - 2023-04-08T12:06:46+05:30 IST