Mumbai vs Hyderabad: టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ రోహిత్ శర్మ ఏం ఎంచుకున్నాడంటే...
ABN, First Publish Date - 2023-05-21T15:16:36+05:30
ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL2023) ప్లే ఆఫ్ (play offs) చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచింది.
ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL2023) ప్లే ఆఫ్ (play offs) చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాస్ గెలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌పై (Sunrisers Hyderabad) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు...
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఏడెన్ మార్ర్కమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లేన్ ఫిలిప్, సాన్విర్ సింగ్, మయాంక్ దగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెమెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెడార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్.
కాగా ప్లే ఆఫ్ రేసులో ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ప్రస్తుతం 14 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్ గెలవడమే కాకుండా చక్కటి రన్‌రేట్‌తో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు కంటే 14 పాయింట్లతోనే ఉన్న ఆర్సీబీ 4వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానాల్లో ఉన్నాయి. అందుకే ఈ రోజు ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల సంఖ్య 16కు చేరుతుంది. ఆదివారమే జరగనున్న గుజరాత్‌పై మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ఈ జట్టు 16 పాయింట్లు దక్కించుకుంటుంది. అప్పుడు రన్‌రేట్ అత్యంత కీలకమవనుంది.
Updated Date - 2023-05-21T15:26:45+05:30 IST